టీఆర్ఎస్ కార్యకర్తల మెరుపు ధర్నా.. తక్షణమే తొలగించాలని డిమాండ్

by Disha Web Desk 19 |
టీఆర్ఎస్ కార్యకర్తల మెరుపు ధర్నా.. తక్షణమే తొలగించాలని డిమాండ్
X

దిశ, కంటోన్మెంట్: తిరుమలగిరిలోని గాంధీ కమ్యూనిటీ హాల్ నుంచి చెత్త డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్‌చార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం డంపింగ్ యార్డును తొలగించాలని కంటోన్మెంట్ టీఆర్ఎస్ పార్టీ మెరుపు ధర్నా నిర్వహించింది. ఆందోళనలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కంటోన్మెంట్ వ్యాప్తంగా సేకరించిన చెత్తను గాంధీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో డంప్ చేయడం వల్ల తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందన్నారు. దీంతో స్థానికులు అనారోగ్యాల పాలవుతున్నారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్ యార్డును తొలగించాలని గతంలో మిలటరీ ఉన్నతాధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదన్నారు. హోలీ పండుగ లోపు చెత్త డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు శ్యాం కుమార్, అనిత ప్రభాకర్, నలిని కిరణ్, పాండు యాదవ్, లోకనాథం, సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, రాజు సింగ్, ప్రవీణ్ యాదవ్, సురేష్, సోమయ్య స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed