జిల్లా నిరుద్యోగులకు లక్కీ ఛాన్స్.. ఉచితంగా పోలీసు ఉద్యోగాలకు శిక్షణ

by Disha Web |
జిల్లా నిరుద్యోగులకు లక్కీ ఛాన్స్..  ఉచితంగా పోలీసు ఉద్యోగాలకు శిక్షణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగులైన యువతీ, యువకులు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకై ఉచిత శిక్షణ కోసం ఆన్ లైన్‌లో పేరు నమోదు చేసుకోవాలని పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీ ఎత్తున పోలీస్ కానిస్టేబుల్ , ఎస్ఐ నియామకాల గురించి నోటిఫికేషన్ జారీ చేయనంది.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ముందుచూపుగా అర్హులైన నిరుద్యోగులైన యువతి, యువకుల కోసం రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో ఉచిత పోలీస్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందుకుగాను ఈ నెల 20 నుండి 25వ తేదీ వరకు అర్హులైన యువతి యువకులు వారి పేరు, తండ్రి పేరు, కులము, ఎత్తు, విద్య అర్హతలు, పుట్టినరోజు, ఫోటో పూర్తి వివరాలు https://docs.google.com/forms/d/e/1FAlpQLSeAsnMS Rqill-RZGCWdlWxOakwptCxbRu EUZMJUS KBQ/viewform?vc=&c=&w=&flr=O లేదా http://surl.li/boqev లేదా http://nizamabadpolice.in/ ఈ ఆన్ లైన్‌ లింక్‌లలో పొందుపరచాలని, ఆన్ లైన్ లింక్ 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఆన్ లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ స్క్రీనింగ్ టెస్ట్ 27వ తేదీ ఆదివారం రోజున నిర్వహించడం జరుగుతుందన్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలలో నిర్వహించడం జరుగుతుందో తరువాత పత్రికా ప్రకటన ద్వారా తెలుపబడుతుందన్నారు. అందులో అర్హత సాధించిన యువతీ, యువకులకు ఉచిత పోలీస్ శిక్షణ అందించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story

Most Viewed