రూ. 6.39 లక్షల ధరలో సరికొత్త 'గ్లాంజా' కారును విడుదల చేసిన టయోటా కిర్లోస్కర్!

by Disha Web Desk 17 |
రూ. 6.39 లక్షల ధరలో సరికొత్త గ్లాంజా కారును విడుదల చేసిన టయోటా కిర్లోస్కర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ తన సరికొత్త వెర్షన్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా కారును మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 6.39 లక్షల ప్రారంభ ధరతో మాన్యువల్‌తో పాటు ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో మార్కెట్లోకి తీసుకొచ్చారు. 1,197 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన ఈ కొత్త వెర్షన్ 5-స్పీడ్ మాన్యూవల్ వేరియంట్ అయితే 6.39-9.19 లక్షల మధ్య, ఆటోమేటిక్ ట్రమ్ రూ. 7.79-9.69 లక్ష్లల మధ్య ఉంటుందని, లీటర్‌కు 22 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా మునుపటి వెర్షన్ కంటే మెరుగ్గా రివైజ్‌డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, కొత్త బంపర్, ఆరు ఎయిర్‌బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, 9 అంగుళాల స్మార్ట్‌ప్లే లాంటి సరికొత్త ఫీచర్ అప్‌డేట్‌లను వినియోగదారుల కోసం తీసుకొచ్చామని వివరించింది.

ఇటీవల గ్లాంజా మోడల్ దేశీయంగా కస్టమర్లను మెరుగైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తోంది. 2022 వెర్షన్ గ్లాంజా మరింత సౌకర్యవంతమైన, భద్రతతో కూడా రైడింగ్‌ను ఇస్తుంది. అర్బన్ క్రూజర్ తరహాలోనే గ్లాంజా మోడల్ కూడా దేశవ్యాప్తంగా టైర్2, టైర్3 నగరాల్లో ఎక్కువమందిని ఆకట్టుకుంటోంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నామని టయోటా కిర్లోస్కర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తదాషి అసజుమా అన్నారు. టెక్నాలజీ పరంగా అత్యాధునికమైన టయోటా ఐ-కనెక్ట్, స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ కనెక్ట్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed