టూరింగ్ కోసం ఉపయోగపడే కొత్త బైక్ ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660

by Disha Web Desk 17 |
టూరింగ్ కోసం ఉపయోగపడే కొత్త బైక్ ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660
X

దిశ,వెబ్‌డెస్క్: ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన సరికొత్త టైగర్ స్పోర్ట్ 660 ADV బైక్‌ని ఇండియాలో లాంచ్ చేయనుంది. కంపెనీ మోటార్‌సైకిల్‌ను మార్చి 29న విడుదల చేయాలని ప్లాన్ చేసింది. దానిని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు మోటార్‌సైకిల్‌ను ముందస్తుగా కూడా బుక్ చేసుకోవచ్చు. కొత్త బైక్ 660cc త్రీ-సిలిండర్ ఇంజన్ ద్వారా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 81 PS @ 10,250rpm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మోటార్‌సైకిల్ ఉత్పత్తి చేసే గరిష్ట టార్క్ 64Nm @ 6,250rpm. ఇంజన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సస్పెన్షన్ పరంగా 41mm USD ఫోర్క్స్, ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ ఉంది. మోటార్‌సైకిల్‌లో TFT డిస్‌ప్లేను అమర్చారు. ABS, బ్లూటూత్, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, పూర్తి LED లైటింగ్ మొదలైనవి ఉన్నాయి. 17-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. టూరింగ్ సమయంలో ఈ బైక్ బాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.8.50 లక్షలు.

Next Story

Most Viewed