Hyderabad MMTS: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు రద్దు

by Disha Web Desk 2 |
Hyderabad MMTS: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో నడిచే 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల 9 రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లో నడిచే 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబర్ గల 9 రైళ్లు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో నడిచే 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్ గల 7 ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో నడిచే 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 నంబర్ గల 7 రైళ్లు, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 47150, 47195 నంబర్ గల సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

Next Story