అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. నత్తనడక సాగుతోన్న కలెక్టరేట్ పనులు

by Dishanational2 |
అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. నత్తనడక సాగుతోన్న కలెక్టరేట్ పనులు
X

దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో నూతన భవన నిర్మాణ పనులు కొన్నేమో వేగవంతంగా పూర్తవుతుండగా, మరికొన్ని ఏమో ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉంటున్నాయి. రాష్ట్రం సిద్ధించి ఎనిమిది ఏళ్లు దాటినా సమైక్య రాష్ట్రంలో నిర్మించిన భవనాలే దిక్కవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక అభివృధి పేరిట చిన్న జిల్లాలు ఎర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పాలన పరంగా అవసరమైన భవనాలు నిర్మించడంలో పూర్తిగా విఫలమయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అవసరమైన కలెక్టరేట్ నూతన భవన పనులను ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చెందంలా ఉన్నాయి.




నత్తనడకన సాగుతున్న కలెక్టరేట్ భవనం పనులు

2016 లో జిల్లా ఏర్పడగా నస్పూర్ శివారులో గల సర్వే నంబర్ 42లో 26 ఎకరాల స్థలంలో 2017 ఫిబ్రవరి 27న స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతులమీదుగా పనులకు భూమి పూజ చేశారు. ఇందుకోసం 41.5 కోట్లు వేచ్చించినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఐదు ఏండ్లు గడిచినా ఇంతవరకు కనీసం పనులు పూర్తి చేసి ప్రారంభించ లేకపోతున్నారు. దీంతో కొన్ని కార్యాలయాలు అద్దె భవనలలో నిర్వహిస్తూ లక్షలలో కిరాయిలు చెల్లిస్తున్నారు. కలెక్టరేట్ భవనం పూర్తి అయితే అన్ని ప్రభుత్వ జిల్లా కార్యాలయాలు ఒకే చోట ఉండటం వల్ల ప్రజలకు సైతం మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది.

భవనం పూర్తి అయినా నోచుకోని సేవలు

జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్‌లో 17 కోట్ల వ్యయంతో 2018‌లో భవన నిర్మాణ పనులను ప్రారంభించి ఎట్టకేలకు ఈ ఏడాది పనులు పూర్తి చేశారు. కాగా పూర్తి అయినా సేవలు అందించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మాతశిశు సంక్షేమ కేంద్రాలో సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఐదు ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి చేయని కలెక్టరేట్ నూతన భవన నిర్మాణ పనులను ఇప్పటికైనా పూర్తి చేసి సేవలని నూతన భవనంలో అందించాల్సిన అవసరం ఉందంటున్నారు.

కాంట్రాక్టర్లను, అధికార పార్టీ నాయకులను బతికించేందుకే నూతన కార్యాలయ ఏర్పాటు పేరిట కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నారు. కానీ, అవి పనులు పూర్తి చేసుకొని ప్రజలకు సేవలు అందించడంలో అధికార పార్టీ నాయకులు శ్రద్ధ చూపడం లేదు. పేరుకే ఇన్ని కోట్లు కేటాయించి భవనం నిర్మిస్తున్నామని చెప్పడం తప్ప, వాటివల్ల ప్రజలకు ఒరిగే లాభం లేదని ప్రజలు వాపోతున్నారు.

నిధులను దుర్వినియోగం చేస్తున్నారు




అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. ప్రజల నుండి వేలల్లో పన్నులు వసూలు చేసి కార్యాలయం నిర్మాణాల పేరిట కేటాయించి వాటిని విస్మరిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా అవి పూర్తి కావడం లేదని, కొన్ని కార్యాలయాలు పూర్తైన వాటిని ప్రారంభించి వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్

Next Story

Most Viewed