మిస్టరీగానే విద్యార్థి మౌనిక మృతి ఘటన

by Web Desk |
మిస్టరీగానే విద్యార్థి మౌనిక మృతి ఘటన
X

దిశ, ఝరాసంగం: జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామానికి చెందిన విద్యార్థి గడ్డం మౌనిక హత్య ఘటన 24 గంటలు గడిచినా మిస్టరీ వీడలేదు పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. విద్యార్థి మౌనిక మృతిపై జహీరాబాద్ పట్టణంలో వివిధ విద్యార్థి సంఘాలు, వివిధ కుల సంఘాలు రాజకీయ నాయకులు ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రాంతీయ హాస్పిటల్లో నిరసనలు మిన్నంటాయి. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మౌనిక అత్యాచార ఘటన చాలా బాధాకరమని నిందితులను ఎంతటివారైనా వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి వెళ్లి మౌనిక మృతదేహాన్ని పరిశీలించారు. ఇది హేయమైన చర్య ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదని మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. విద్యార్థి మౌనిక మృతిపై జహీరాబాద్ పట్టణంలోని వివిధ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. నిందితులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్ధి లోకం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి.. మందకృష్ణ మాదిగ





హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి హత్యకు హత్యకు గురైన బాలిక మృతదేహాన్నీ సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాల ఆదుకోవాలి అన్నారు. కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. హుగ్గేల్లి గ్రామంలో జరిగిన మౌనిక దుండగులు హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబానికి ప్రభత్వ పరంగా ఎక్స్ గ్రేషియా అందించి, డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ప్రభుత్వం అందించే అన్ని రకాల సహాయాలను అందించాలని డిమాండ్ చేశారు.

Next Story