ప్రధాని సభకు సొంత పార్టీ CM దూరం.. కారణం ఇదే!

by Disha Web |
ప్రధాని సభకు సొంత పార్టీ CM దూరం.. కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కరోనా బారిన పడ్డారు. శనివారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలతో కనిపించడంతో టెస్టులు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారు వైద్య పరీక్షలు చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా బారిన పడటంతో ఇవాళ్టి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటునట్లు బస్వరాజ్ బొమ్మై వెల్లడించారు. కాగా, ఇవాళ ఢిల్లీలో మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం, రేపు జరగాల్సిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. ఇంతలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

Next Story

Most Viewed