మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి బంధన్ బ్యాంక్!

by Disha Web Desk 17 |
మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి బంధన్ బ్యాంక్!
X

ముంబై: ప్రముఖ ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంకు మాతృసంస్థ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్ లిమిటెడ్ కన్సార్టియం కీలక భాగస్వామ్యానికి చేరువలో ఉంది. మ్యూచువల్ ఫండ్ ఆస్తులను నిర్వహించే ఐడీఎఫ్‌సీకి చెందిన మ్యూచువల్ ఫండ్ విభాగాన్ని కొనుగోలు చేసేందుకు వేసిన బిడ్లలో షార్ట్‌లిస్ట్ చేసినట్టు సమాచారం. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 4,500 కోట్లుగా తెలుస్తోంది. బంధన్ బ్యాంకు ప్రమోటర్ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కన్సార్టియంలో సింగపూర్ సావరిన్ వెల్త్‌ఫండ్ జీఐసీ, లోకల్ ప్రైవేట్ ఈక్విటీ క్రైస్ కేపిటల్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే గృహ్ ఫైనాన్స్ కంపెనీని సొంతం చేసుకున్న బంధన్ బ్యాంకుకు ఆర్థిక సేవల రంగంలో ఇది రెండో ఒప్పందంగా ఉండనుంది.

హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ అనుబంధ కంపెనీయే గృహ్ ఫైనాన్స్. 2019, జనవరిలో బంధన్ బ్యాంక్ ఈ కంపెనీని సొంతం చేసుకుంది. ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ విభాగం ఐడీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కొనుగోలు తర్వాత నిర్వహణ, వ్యాపార నిర్మాణ వ్యవహారాలను క్రైస్ కేపిటల్ కన్సార్టియం చూసుకోనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించి ఐడీఎఫ్‌సీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ విభాగం ఈక్విటీ ఫండ్‌ల కంటే రుణ ఆధారిత మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎక్కువగా కలిగి ఉంది. ఈ కారణంగానే సగటు విలువ కంటే కొంత తక్కువలో ఈ ఒప్పందం జరిగిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు.



Next Story

Most Viewed