హిజబ్ వివాదంలో కర్ణాటక చీఫ్ జస్టిస్‌కు బెదిరింపులు

by Disha Web Desk 13 |
హిజబ్ వివాదంలో కర్ణాటక చీఫ్ జస్టిస్‌కు బెదిరింపులు
X

బెంగళూరు: వివాదస్పదమైన హిజబ్ కేసులో తీర్పునిచ్చిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు బెదిరింపులు తప్పట్లేదు. తాజాగా బెదిరింపులకు పాల్పడిన తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా అంతకుముందే ప్రభుత్వం ముగ్గురు జడ్జిలకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బెదిరింపులకు సంబంధించి న్యాయవాది ఉమాపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో దాడులకు ప్రేరేపించేలా కామెంట్లు, వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.


'హిజాబ్ వివాదంపై తీర్పునిచ్చిన న్యాయమూర్తులు ఏ ప్రాంతంలో తిరుగుతారో మాకు తెలుసు అని కొందరు అన్నారు' అని ఆయన ఆరోపించారు. దీని ఆధారంగా పలు ప్రాంతాల్లో కే‌సులు నమోదు చేశారు. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంతకుముందు కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లోకి హిజబ్ తప్పనిసరి కాదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలు ప్రాంతాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.



Next Story