అశోక్ గెహ్లట్‌వి తాలిబన్ ఆలోచనలు: ఎంపీ రాజ్యవర్థన్ రాథోర్

by Disha Web Desk 17 |
అశోక్ గెహ్లట్‌వి తాలిబన్ ఆలోచనలు: ఎంపీ రాజ్యవర్థన్ రాథోర్
X

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కరౌలీ ఘర్షణ వ్యవహారంలో అశోక్ గెహ్లట్ ప్రభుత్వం తాలిబన్ ఆలోచన చేస్తుందని బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్ రాథోర్ ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తూ, బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. గత వారం నవ సంవత్సరం సందర్భంగా మోటార్ సైకిల్ ర్యాలీలో జరిగిన ఘర్షణల్లో 8 మంది పోలీసులు, 12 మంది సామాన్యులు గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో దుకాణాలు, కార్లను ఆందోళన కారులు నిప్పుపెట్టారు. ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులు వ్యతిరేక నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు చూసి చూడనట్లు వదిలేశారని రాథోర్ ఆరోపించారు. '36 సామాజిక వర్గాలు కలిసికట్టుగా ఉన్న రాజస్థాన్‌లో, రాష్ట్ర ప్రభుత్వం తాలిబన్ ఆలోచనలతో పనిచేస్తుంది. కరౌలీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టం. పోలీసులు ఏం చేశారు. కళ్లు మూసుకుని ఉన్నారా? అక్కడ పెద్ద ఎత్తున రాళ్లు ముందే ఉన్నాయి' అని అన్నారు.

సంఘటన జరిగి ఏడు రోజులు గడుస్తున్నా ఒక్క అరెస్ట్ కూడా చేయలేదని, బీజేపీ కార్యకర్తలు నిరసన తెలపడంతో కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇక, పోలీస్ చీఫ్ మోహన్ లాల్ లాథర్ మాట్లాడుతూ.. 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 23 మందిని అరెస్ట్ చేశాం. మరో 44 మందిని విచారణలో గుర్తించాం' అని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఈ తరహా హింసకు చోటు లేదని కాంగ్రెస్ నేత సచిన్ ఫైలట్ అన్నారు. చట్టప్రకారం నిష్పక్షపాత విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు ఎవ్వరిని వదిలిపెట్టరని తెలిపారు.



Next Story

Most Viewed