జంట హత్య కేసులో.. ఆరుగురికి జీవితఖైదు!

by Disha Web Desk 13 |
జంట హత్య కేసులో.. ఆరుగురికి జీవితఖైదు!
X

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి లో జంట హత్య కేసులో ఆరుగురికి జీవిత ఖైదు పడింది. ఈ మేరకు ఆదిలాబాద్ షేషన్ కోర్టు న్యాయమూర్తి మైత్రేయ గురువారం శివరాత్రి ప్రసాద్, శివరాత్రి నారాయణ, కస్తూరి రవీందర్, కల్లూరి సుధాకర్, శివరాత్రి కృష్ణ, శివరాత్రి శంకర్ లకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు.

బెల్లం పల్లి లోని సుబ్బారావు పల్లి శివారులో.. 2015 సంవత్సరంలో ఆగస్టు 2న చెందిన ఆరుగురు నేరస్తులు సుబ్బారావు పల్లి శివారులోని స్టోన్ క్వారీ భూమి కాజేయాలని కుట్రపన్ని నయజమానులైన సిరికొండ సాంబయ్య, రాస గణపతి లను బర్షెలతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అడ్డువచ్చిన సిరికొండ రాకేష్, సిరికొండ సత్యనారాయణను తీవ్రంగా గాయపరిచారు. ఘటనా స్థలంలోనే సిరికొండ సాంబయ్య మృతి చెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గణపతి మృతి చెందాడు. ఈ క్రమంలో అదే రోజు గాయపడిన సిరికొండ రాకేష్ కాసి పెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి కాశీ పేట ఎస్ఐ శ్యామ్ సుందర్ హత్య నేరం నమోదు చేశారు.

నేరము సంఖ్య 79/2015 సెక్షన్ 120 (బి) 148, 302.307. r/w 149 ఐపీసీ, సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అప్పటి సీఐ పి. సదయ్య, ఏసీపీలు కే రమణారెడ్డి, సి సతీష్ లు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో సాంకేతిక సాక్ష్యం తో పాటు ప్రత్యేక సాక్షులను విచారించారు. గాయపడిన వారిని విచారించి స్టోన్ క్వారీ భూమి వివాదంపై కుట్ర పన్ని ఇరువురిని హత్య చేసిన ఆరుగురు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

హత్య నేరం పై ఆరుగురు నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచి సాంకేతిక పరిజ్ఞానం తో పాటు ప్రత్యక్ష సాక్షులతో తుది నివేదిక చార్జిషీట్ న్యాయస్థానంలో దాఖలు చేయగా. ఆరుగురు నేరస్తులపై ఆదిలాబాద్ న్యాయస్థానంలో సాక్షుల విచారణ కొనసాగుతున్నది. న్యాయస్థానంలో సాక్షుల పర్యవేక్షణ చేపడుతున్న బెల్లంపల్లి ఏసిపి ఏ. మహేష్, బెల్లంపల్లి సిఐ పి ప్రమోద్ రావు, కాసీపేట ఎస్ఐ కె. నరేష్, ప్రాసిక్యూషన్ విభాగం నుండి అదనపు పీపీలు ఈ కిరణ్ కుమార్ రెడ్డి, ముస్కు రమణారెడ్డి, మేకల మధుకర్, కోర్టు వ్యవహారాల ఇన్చార్జి అధికారులు సయ్యద్ తాజుద్దీన్, ఎండి జహీరుద్దీన్, జి రాఘవేంద్ర రావు సహకారంతో 41 మంది సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా నేరస్తులపై అభియోగం రుజువు చేయడంతో గురువారం నిందితులకు యావజ్జీవ ఖైదు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

Next Story

Most Viewed