CPM జాతీయ కార్యదర్శిగా సీతారాం ఏచూరి

by Disha Web Desk 2 |
CPM జాతీయ కార్యదర్శిగా సీతారాం ఏచూరి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. కేరళలోని కన్నూరులో జరుగుతున్న సీపీఎం 23వ అఖిల భారత మహాసభలో పార్టీ ప్రముఖులందరూ కలిసి ఏకగ్రీవంగా ఏచూరిని మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. కాగా, 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1999లో పొలిట్‌ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Next Story

Most Viewed