సముద్రపు అడుగున డెత్‌పూల్.. ఏ జీవి ఈదినా చావే!

by Disha Web Desk |
సముద్రపు అడుగున డెత్‌పూల్.. ఏ జీవి ఈదినా చావే!
X

దిశ, ఫీచర్స్ : ఈ ప్రపంచంలో శాస్త్ర సాంకేతికతకు అంతుచిక్కని రహస్యాలకు కొదువలేదు. ఆయా నిగూఢ అంశాల వెనుక సైంటిస్టుల మేధస్సుకు అందని శక్తి ఏదో ఉందనే భావనే ఇప్పటికీ చెలామణిలో ఉంది. సముద్ర అంతర్భాగం కూడా ఇలాంటి మార్మిక విషయాలకు వేదిక వంటిదే. అలాగే శాస్త్రవేత్తలు ఎర్ర సముద్రం దిగువన 10 అడుగుల పొడవైన ఉప్పునీటి కొలను కనుగొన్నారు. సముద్ర జీవులకేగాక మానవులకు కూడా ప్రాణాంతకమైన ఈ కొలను గుండా ఏ జీవి ఈదినా చనిపోతుంది.

యూనివర్సిటీ ఆఫ్ మియామీకి చెందిన శాస్త్రవేత్తల బృందం 'డెత్ పూల్'ను కనుగొంది. బృందంలో భాగమైన ప్రొఫెసర్ సామ్ పుర్కిన్స్.. ఈ ఉప్పునీటి కొలనులో ఆక్సిజన్ లేదని, ఇలాంటి పరిస్థితులు సముద్ర జీవులను చంపగలవని వివరించారు. నీటి అడుగున రిమోట్‌ కంట్రోల్‌తో ఆపరేట్ చేయబడే వాహనం(ROV)ని ఉపయోగించి 1,770 మీటర్ల లోతులో ఉన్న కొలనును సైంటిస్టుల బృందం కనుగొంది.'సాధారణంగా ఇంతటి లోతున సముద్రగర్భంలో ఎక్కువగా జీవం ఉనికిలో ఉండదు. కానీ ఎడారి జీవితాన్ని తలపించే ఈ ఉప్పునీటి కొలనుల్లో మందపాటి సూక్ష్మజీవుల సమూహం.. వైవిధ్యమైన జంతువులకు మద్దతిస్తాయని ప్రొఫెసర్ పుర్కిన్స్ చెప్పారు. ప్రమాదాన్ని అంచనావేయని కొన్ని సముద్ర జీవులకు ఇది ప్రతికూలాంశమే అయినా కొలనులో జీవవైవిధ్యం సమృద్ధిగా ఉంటుంది. వీటికి ఇలాంటి దురదృష్టకర చేపలు ఆహారంగా ఉపయోగపడతాయి.

కాగా మిలియన్ల సంవత్సరాల క్రితం భూగ్రహం మీద మహాసముద్రాలు ఎలా ఏర్పడ్డాయో కనుగొనేందుకు ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో శాస్త్రవేత్తలను ప్రేరేపించగలదని ప్రొఫెసర్ పుర్కిన్స్ చెప్పారు. విపరీతమైన వాతావరణంలో జీవించే సూక్ష్మజీవుల సమూహానికి సంబంధించిన ఈ ఆవిష్కరణ భూమిపై జీవిత పరిమితులను కనుగొనడంలో సాయపడుతుందని.. సౌర వ్యవస్థ లోపల, వెలుపల జీవితం కోసం అన్వేషణకు అన్వయించవచ్చుకోవచ్చని తెలిపారు. అంతేకాదు భూమిపై జీవం యొక్క పరిమితులను మనం అర్థం చేసుకునేంత వరకు ఏలియన్ ప్లానెట్స్ ఏవైనా జీవులకు ఆతిథ్యం ఇవ్వగలవో లేదో గుర్తించడం కష్టమని చెప్పారు పుర్కిన్స్.

Next Story

Most Viewed