ఈడీ ఎదుట సంజయ్ రౌత్ భార్య

by Disha Web Desk |
ఈడీ ఎదుట సంజయ్ రౌత్ భార్య
X

ముంబై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ ను ఈడీ అధికారులు విచారించారు. తన కూతురు, సంజయ్ సోదరుడితో కలసి ఆమె శనివారం ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు తొమ్మిది గంటల పాటు విచారణ కొనసాగింది. ఖాతా లావాదేవీలు, భూ కొనుగోలు విషయమై ప్రశ్నలు అడిగినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. పాత్ర చౌల్ స్కాంలో వర్షా పాత్రపై విచారణలో ఆరా తీసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నారు. వారం రోజుల క్రితం రూ.1000 కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలతో భాగంగా ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.11.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story

Most Viewed