60°C దాటిన ఎండ.. వేడి గాలులకు పట్టాలు తప్పిన ట్రైన్..

by Disha Web Desk 2 |
60°C దాటిన ఎండ.. వేడి గాలులకు పట్టాలు తప్పిన ట్రైన్..
X

దిశ, ఫీచర్స్ : సిగ్నల్స్ సరిగ్గా లేక రైలు బండి పట్టాలు తప్పడం విన్నాం కానీ వేడి గాలుల ప్రభావంతో కూడా ఇలా జరుగుతుందని వినలేదు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో మంగళవారం (జూన్ 28) ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బే ఏరియాలోని కాంకర్డ్ నగరానికి సమీపంలో ఉష్ణోగ్రతలు 60 డిగ్రీల సెల్సియస్(140 ఫారెన్‌హీట్)కు చేరుకున్నాయి. దీంతో రైల్వే ట్రాక్ వ్యాకోచించి రైల్ డీరేల్ అయింది. ఈ ప్రమాద సమయంలో ట్రైన్‌లో 50 మంది ప్రయాణికులు ఉండగా.. వారంతా స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. రైల్వే సాధారణ ఆపరేటింగ్ టెంపరేచర్ కంటే 35 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు కావడంతో ఈ ప్రమాదం నెలకొందంటున్న బార్ట్ రైల్వేస్.. హీట్ వేవ్ కారణంగా ట్రైన్ పట్టాలు తప్పడమనేది అరుదైన విషయమని పేర్కొంది.

Next Story

Most Viewed