రికార్డు స్థాయిలో 56 శాతం పెరిగిన స్టీల్ ప్లాంట్ టర్నోవర్!

by Disha Web Desk 17 |
రికార్డు స్థాయిలో 56 శాతం పెరిగిన స్టీల్ ప్లాంట్ టర్నోవర్!
X

దిశ, వెబ్‌డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో టర్నోవర్‌ను సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 28,008 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 56 శాతం ఎక్కువ కావడం విశేషం. 2020-21 లో స్టీల్ ప్లాంట్ టర్నోవర్ రూ. 17,956 కోట్లుగా నమోదైంది. కొవిడ్-19 మహమ్మారి తో పాటు బొగ్గు కొరత వంటి సవాళ్లను అధిగమించి సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 57.73 లక్షల టన్నుల హాట్ మెటల్, 52.72 లక్షల టన్నుల క్రూడ్ స్టీల్, 51.38 లక్షల టన్నుల సేలబుల్ స్టీల్‌ను ఉత్పత్తి చేసినట్టు స్టీల్ ప్లాంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అంతేకాకుండా 2021-22 లో మొత్తం రూ. 5.607 కోట్ల విలువైన ఎగుమతులను నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా మాట్లాడిన స్టీల్ ప్లాంట్ చైర్మన్, ఎండీ అతుల్ భట్.. రికార్డు స్థాయిలో టర్నోవర్‌ను సాధించడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందిని అభినందిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో కూడా మరింత ఉత్సాహంతో, టీమ్‌వర్క్‌తో సంస్థ స్థాయిని మరింత పెంచుతూ ఉన్నత శిఖరాలను అధిగమిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed