పాక్ సరిహద్దుల్లో రఫెల్, సుఖోయ్ యుద్ధ విన్యాసాలు: ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ

by Web Desk |
పాక్ సరిహద్దుల్లో రఫెల్, సుఖోయ్ యుద్ధ విన్యాసాలు: ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: భారత్ తన వాయు దళ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు సిద్ధమైంది. వచ్చే సోమవారం భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని జైసల్మేర్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో వాయుశక్తి విన్యాసాలు జరగనున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. రఫెల్ విమానాలు పాల్గొంటున్న ఈ యుద్ధ విన్యాసాల్లో తొలిసారిగా ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హజరుకానున్నట్లు తెలిపారు. భారత వైమానిక దళం తన సంసిద్ధతను ప్రదర్శించడానికి ప్రతి మూడేళ్లకు పోఖ్రాన్ పరిధిలో ఈ విన్యాసాలను నిర్వహిస్తుంది. 148 ఎయిర్ క్రాఫ్ట్‌లు పాల్గొనే ఈ ప్రదర్శనలో 109 యుద్ధ విమానాలు ఉన్నట్లు ఐఏఎఫ్ అధికారి తెలిపారు. అంతేకాకుండా 24 హెలికాప్టర్లు, 7 రవాణా ఎయిర్ క్రాఫ్ట్‌లు, 4 రిమోట్ ఫైలెట్‌లు శక్తి వ్యాయామాన్ని నిర్వహించనున్నాయి. అంతేకాకుండా యుద్ధ విమానాలైన జాగ్వర్, సుఖోయ్-30, ఎంఐజీ-29, తేజస్, రఫెల్, మైరెగ్-2000 ఈ విన్యాసాల్లో భాగం కానున్నాయి. ముందుగా 17 జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్ లతో 75 ఆకారంలో ఏర్పడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు.



Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed