అమిత్ షాకు పంజాబ్ ముఖ్యమంత్రి వార్నింగ్

by Dishafeatures2 |
అమిత్ షాకు పంజాబ్ ముఖ్యమంత్రి వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ వార్నింగ్ ఇచ్చారు. ఛండీఘర్ విషయంలో పంజాబ్ వాసులకు అమిత్ షా అన్యాయం చేస్తున్నారని, షా నిర్ణయం వల్ల ఎవ్వరూ లాభపొందేది లేదని అన్నారు. అయితే తాజాగా పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని ఛండీఘర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాజధాని విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ దాదాపు 20-25 ఏళ్ల నుంచి ఉందని కేంద్రం తెలిపింది.

అంతేకాకుండా మార్చి 28 నుంచి ఛండీఘర్‌లో కేంద్ర పాలన నియమాలు చెల్లుబాటు అవుతాయని, తద్వారా యూటీ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దీనిపై స్పందించిన పంజాబ్ సీఎం షాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పంజాబ్ ప్రజల హక్కులను లాక్కునే ప్రయత్నాలు చేస్తోందని, తమ హక్కుల జోలికి వస్తే మరోసారి ఉద్యమానికి తెర లేపుతామని వార్నింగ్ ఇచ్చారు. మరి దీనిపై కేంద్ర ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story

Most Viewed