Priyanka Chopra: ఇలాగే చూస్తూ ఊరుకుందామా? లీడర్స్‌ను ప్రశ్నించిన ప్రియాంక

by Disha Web Desk 5 |
Priyanka Chopra: ఇలాగే చూస్తూ ఊరుకుందామా? లీడర్స్‌ను ప్రశ్నించిన ప్రియాంక
X

దిశ, సినిమా : ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో శరణార్థులను ఆదుకోవాలంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వరల్డ్ లీడర్స్‌కు పిలుపునిచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. పర్సనల్ ఫొటోలు, వీడియోల షేరింగ్‌తో పాటు ముఖ్యమైన సమస్యలపై తన గళం వినిపించేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుంటుంది. ఇదే క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ ప్రపంచ నాయకులను విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్‌లోని శరణార్థులకు సాయమందించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని రిక్వెస్ట్ చేసింది. యూనిసెఫ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న ప్రియాంక వీడియోలో మాట్లాడుతూ.. 'తూర్పు ఐరోపాలో శరణార్థులకు అవసరమైన మద్దతునిస్తూ అండగా నిలబడాలి. ఉక్రెయిన్ నుంచి విడిచి వెళ్లిన ప్రజలందరికీ సాయం చేయడానికి మీరు చర్య తీసుకోవాలి. ఇది చూస్తూ ఊరుకునే సమయం కాదు' అని వివరించింది.



Next Story

Most Viewed