ఆన్‌లైన్ అప్లికేషన్‌ల పేరుతో భారీ మోసం.. గ్రామాలే వీరి టార్గెట్..!

by Disha Web Desk 19 |
ఆన్‌లైన్ అప్లికేషన్‌ల పేరుతో భారీ మోసం.. గ్రామాలే వీరి టార్గెట్..!
X

దిశ, తిమ్మాపూర్: ఆన్లైన్ అప్లికేషన్ల పేరిట మోసానికి పాల్పడిన శివ కుమార్, కొత్తూర్ ఆనంద్‌ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ తుల శ్రీనివాస్ వెల్లడించారు. కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాల్లో ఆన్లైన్ అప్లికేషన్ల పేరిట మనీ సర్క్యులేషన్ పద్ధతిలో ప్రజల నుండి పెట్టుబడి పెట్టించే మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన శివకుమార్, కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామానికి చెందిన కొత్తూర్ ఆనంద్‌లు కలిసి వెల్కమ్ యాడ్స్ అప్ అనే అప్లికేషన్‌లో ఆన్లైన్లో ద్వారా పెట్టుబడి పెడితే అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపి ప్రజల నుండి డబ్బులను సేకరించారు. 2018 సంవత్సరంలో వెల్కమ్ యాడ్స్ అప్ అప్లికేషన్ను గూగుల్ ప్లే స్టోర్‌లో పెట్టి దీని ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, దీనిలో పెట్టుబడులు పెట్టవచ్చు అంటూ ప్రచారం చేయాలని ప్రజలకు సూచించారు.


పెట్టుబడిలో ప్రతి రోజు ఒక శాతం తిరిగి వాళ్ళ అకౌంట్‌కు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఇది నమ్మి కరీంనగర్‌కు చెందిన 20మంది రూ.30లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇక ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. 2021లో వెల్కమ్ క్లబ్ అనే వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి 6వేల రూపాయలు కడితే గోవా తదితర టూర్లకు వెళ్లవచ్చని ఆన్లైన్లో పెట్టారు. దీనిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7వేల మంది వరకు అయిదు కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బు తీసుకుని వారిని మోసం చేశారని తెలిపారు. శివ కుమార్ ఇప్పటివరకు వేరు వేరు పేర్లతో తొమ్మిది వెబ్ సైట్లు సృష్టించి ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కేసులు ఉన్నాయని వెల్లడించారు.

Next Story

Most Viewed