ALERT : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

by Rajesh |
ALERT : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. నేడు నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని తెలిపింది. 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు తెలిపింది. అక్కడక్కడా పిడిగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నెలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Next Story

Most Viewed