రంగంలోకి దిగిన కమిషనర్.. రూ. 3 లక్షల పాత బకాయిని చెల్లించిన భవనం యజమాని

by Dishanational1 |
రంగంలోకి దిగిన కమిషనర్.. రూ. 3 లక్షల పాత బకాయిని చెల్లించిన భవనం యజమాని
X

దిశ, గోదావరిఖని: ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయదారులపై రామగుండం నగర పాలక సంస్థ అధికారులు కొరడా ఝళిపించారు. ఆర్థిక సంవత్సరం 2021-22 మరో కొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో 100 శాతం పన్ను వసూల్లే లక్ష్యంగా రామగుండం నగర పాలక సంస్థ సిబ్బంది పని చేస్తున్నారు. శనివారం రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి. సుమన్ రావు స్వయంగా రంగంలోకి దిగారు. టాప్ 100 పన్ను బకాయదారుల జాబితా రూపొందించి స్వయంగా మాట్లాడి పన్ను చెల్లించేలా ప్రోత్సహిస్తున్నారు. కమిషనర్ చొరవతో గత మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న మూడు లక్షల రూపాయల బకాయలను కూడా ఒక భవనం వారు శనివారం చెల్లించారు. అలాగే ఆటో నగర్, మేడిపల్లి, అన్నపూర్ణ కాలనీ, కృష్ణా నగర్, గంగా నగర్, కళ్యాణ్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పన్ను వసూళ్ల బృందానికి దిశా నిర్దేశం చేస్తూ బకాయదారులను పన్ను చెల్లించి సహకరించాలని ఆయన కోరారు. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో సెలవు దినాలలో కూడా తమ సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. కార్యాలయంలోని కౌంటర్ లు కూడా సెలవు దినాలలో యథాతథంగా పని చేస్తాయని అన్నారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ నగర పాలక సంస్థ కార్యాలయంలో పన్ను చెల్లించవచ్చని అన్నారు. ప్రజలు నగర పాలక సంస్థకు రాలేని పక్షంలో మీ సేవా కేంద్రాల్లో, ఆన్ లైన్ లో కూడా పన్ను చెల్లించే సౌలభ్యం ఉందని అన్నారు. జరిమానాలు, జప్తుల బారిన పడకుండా సకాలంలో పన్ను చెల్లించి అభివృద్దికి సహకరించాలని ఆయన కోరారు.

కాగా మార్చి 11, 2022 నాటికి ప్రైవేటు ఆస్తుల నుండి 62.84 శాతం, ప్రభుత్వ ఆస్తుల నుండి 64 .11 శాతం పన్నులు వసూళ్లు అయ్యాయని పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్తుల నుండి రూ 3, 25,83, 000, ప్రభుత్వ ఆస్తుల నుండి రూ 2 , 76 , 84 ,000 ఇంకా వసూలు కావాల్సివుండగా ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 18 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని.. ఈ నేపధ్యంలో రామగుండం నగర పాలక సంస్థ యావత్ సిబ్బంది పన్ను వసూళ్లపైనే దృష్టి సారించారన్నారు. కమిషనర్ ఆదేశాలతో దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న బకాయదారుల ఆస్తులను సీజ్ చేశారు. అలాగే నల్లా కనెక్షన్ లను కూడా తొలగించారు. రామగుండం నగర పాలక సంస్థ సెక్రెటరీ రాములు, రెవెన్యూ ఆఫీసర్ మనోహర్, నీటి సరఫరా విభాగం జూనియర్ అసిస్టెంట్ శంకర్ రావు, రెవెన్యూ సిబ్బంది ఈ ప్రత్యేక పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని పర్యవేక్షి స్తున్నారు.



Next Story

Most Viewed