ఇంటర్‌ పరీక్షల కొత్త తేదీలు ప్రకటంచిన బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌మీడియట్‌

by Disha Web |
ఇంటర్‌ పరీక్షల కొత్త తేదీలు ప్రకటంచిన బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌మీడియట్‌
X

దిశ, ఏపీ బ్యూరో: ఇంటర్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌మీడియట్‌ ఎడ్యుకేషన్ శుక్రవారం‌ విడుదల చేసింది. మే 6 నుంచి 23 వరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ జరగనుండగా, మే 7 నుంచి 24 వరకు ఇంటర్‌ సెకండీయర్‌ ఎగ్జామ్స్‌ జరగనున్నాయని ప్రకటించింది.

ఇంటర్‌ మెుదటి సంవత్సరం విద్యార్థులకు మే 6న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-‌ 1, మే 9న ఇంగ్లీష్‌ పేపర్-‌ 1, మే 11న మ్యాథమెటిక్స్‌ పేపర్‌ -1A, బోటనీ పేపర్-1 సివిక్స్‌ పేపర్‌-1, మే 13న మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1B, జువాలజీ పేపర్‌ -1, హిస్టరీ పేపర్‌ 1, మే 16న ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌ -1, మే 18న కెమిస్ట్రీ పేపర్‌ -1, కామర్స్‌ పేపర్‌-1, సోషయాలజీ పేపర్‌ -1, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-1, మే 20న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌ -1, లాజిక్‌ పేపర్‌-1, బ్రిడ్జ్‌ కోర్సు మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1(బైపీసీ స్టూడెంట్స్‌), మే 23న మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1, జాగ్రఫీ పేపర్‌-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షలు ఉదయం 9.00 నుంచి 12.00 గంటల వరకు నిర్వహించనుంది.

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు మే 7న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, మే 10న ఇంగ్లీష్‌ పేపర్‌-2, మే 12న మ్యాథమెటిక్స్‌ పేపర్‌ 2A, బోటనీ పేపర్‌-2, సివిక్స్‌ పేపర్‌ -2, మే 14న మ్యాథమెటిక్స్‌ పేపర్‌ 2B, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2, మే 17న ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ మేపర్‌-2, మే 19న కెమిస్ట్రీ పేపర్‌-2, కామర్స్‌ పేపర్‌-2, సోషయాలజీ పేపర్‌-2, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-2, మే 21న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, లాజిక్‌ పేపర్‌-2, బ్రిడ్జ్‌ కోర్స్‌ మ్యాథమెటిక్స్‌ పేపర్‌-2( బైపీసీ స్టూడెంట్స్‌), మే 24 మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -2, జాగ్రఫీ పేపర్‌-2 పరీక్షలు ఉండనున్నట్లు బోర్డు ప్రకటించింది. పరీక్షలు ఉదయం 9.00 నుంచి 12.00 గంటల వరకు నిర్వహించనుంది.



Next Story

Most Viewed