'దిశ' ఎఫెక్ట్.. అది ప్రభుత్వ భూమిగా తేల్చిన ఆర్డీవో

by Disha Web |
దిశ ఎఫెక్ట్.. అది ప్రభుత్వ భూమిగా తేల్చిన ఆర్డీవో
X

దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని కొన్ని ఏరియాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో 'దిశ' ఆదివారం 'టాస్క్ ఫోర్స్ వ్యూహం' చతికిలపడిందా..? అను శీర్షికతో ఓ కథనంతో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. ఈ నేపథ్యంలో నర్సంపేట ఆర్డీవో పవన్ కుమార్ 'దిశ' కథనంపై స్పందించారు. అది ముమ్మాటికీ ప్రభుత్వ భూమే అని స్పష్టం చేశారు.

ఆ స్థలంలో ఎలాంటి డెవలప్మెంట్ పనులు చేపట్టవద్దని గత నెల సంబంధిత బాధ్యులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల్ని కాపాడే ఉద్దేశ్యం, అక్రమ కట్టడాల కూల్చివేత లక్ష్యంగా ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ బృందంలో పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ ది ముఖ్య పాత్ర అన్నారు. రెండు, మూడు రోజుల కిందట నర్సంపేట కమిషనర్ విద్యాధర్ బదిలీ అయ్యారని తెలిపారు. ఇంచార్జి కమిషనర్ రాగానే మరోసారి ఆదేశాలిస్తామన్నారు. త్వరలోనే 709/అ సర్వేనెంబర్‌లోని ప్రభుత్వ భూమికి సంబంధించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆలస్యానికి పని ఒత్తిడి కారణమని, ఎట్టిపరిస్థితుల్లోనూ నర్సంపేట పరిధిలోని ప్రభుత్వ భూముల్ని కాపాడటమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed