BREAKING:సెషన్స్ కోర్టులో భారీ అగ్ని ప్రమాదం

by Disha Web Desk 18 |
BREAKING:సెషన్స్ కోర్టులో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు వెలుపల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో లాయర్లు అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో న్యాయవాదులకు చెందిన ఛాంబర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. న్యాయవాదులకు సంబంధించిన పలు వస్తువులు అగ్నికి అహుతైనట్లుగా తెలుస్తోంది. ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed