MLC Kavitha: మేము తగ్గం.. మీరే తగ్గాలి: ఎమ్మెల్సీ కవిత

by Disha Web Desk 2 |
MLC Kavitha: మేము తగ్గం.. మీరే తగ్గాలి: ఎమ్మెల్సీ కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రంపై వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ శూన్యమని, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐకి సరైన విధానం లేదని, వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తే.. రాష్ట్రాలు దానికి అనుగుణంగా పంటలు వేయడానికి కార్యచరణ చేసుకుంటారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పంటల విషయంలో వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని కోరారు.



Next Story

Most Viewed