బిడ్డ‌ను చంక‌నెత్తుకొని స్కూలుకెళ్తున్న‌ 10 ఏళ్ల బాలిక! రాష్ట్ర‌మంత్రి షాక్‌!!

by Disha Web Desk 20 |
బిడ్డ‌ను చంక‌నెత్తుకొని స్కూలుకెళ్తున్న‌ 10 ఏళ్ల బాలిక! రాష్ట్ర‌మంత్రి షాక్‌!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః చ‌దువుకోవ‌డం.. చాలామందికి అదొక 'ప‌రువు', ఇంకొంద‌రికి పెద్ద‌య్యేవ‌ర‌కూ 'టైమ్‌పాస్‌', 'జ‌ల్సా టైమ్‌', మ‌రికొంద‌రికి డ‌బ్బుసంపాదించ‌డానికి క్వాలిఫికేష‌న్‌. అయితే, కొంద‌రికి చ‌దువొక ఇష్టం, ప్రేమ‌... చ‌దివితేనే వారికి జీవితం. అలా చ‌దువు కోసం ప్రాణాల‌కు తెగించిన మ‌లాలాకు నోబెల్ ద‌క్కింది. కెన‌డా పౌర‌స‌త్వం, బ్రిటీష్‌ నివాసం, ఇంకా ఎన్నో.. అంత‌కుమించి, ఆమె అంత‌ర్జాతీయంగా స్త్రీల‌కు ఓ అంబాసిడ‌ర్ అయ్యింది. అయితే, ఇలా చ‌దువంటే అమిత‌మైన ఇష్ట‌మున్న పేద పిల్ల‌లు ఎంతో మంది ఇక్క‌డున్నారు. ఒక్క‌పూట‌ క‌డుపునింపుకోడానికి నానా క‌ష్టాలు ప‌డుతున్న కుటుంబాల్లో బాధ్య‌త‌లతో పాటు పుస్త‌కాల‌ను మోసుకుంటూ బ‌డికి పోతున్న అభాగ్యులు ఇంకా ఉన్నారు. ఇలాంటి వారిలో 10 ఏళ్ల ఈ పాప ఒక మ‌ణిపూస‌. మణిపూర్‌లో తన చెల్లెలికి బేబీ సిట్టింగ్ చేస్తూ పాఠశాలకు వెళ్లేందుకు 10 ఏళ్ల బాలిక చేస్తున్న‌ పోరాటం సోషల్ మీడియాలో అంద‌రి హృదయాలను గెలుచుకుంది.

మణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్‌కు చెందిన 10 ఏళ్ల మెయినింగ్‌సిన్లియు పమీ స్కూల్ వెళ్లే చిన్నారి. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా బయటకు వెళుతుంటే త‌న చెల్లిల్ని ఎత్తుకొని ప‌మీ పాఠ‌శాల‌కు వ‌స్తోంది. ఈ చిన్నారి మెయినింగ్‌సిన్లియు ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీన్ని చూసిన‌ మణిపూర్ వ్యవసాయ మంత్రి తొంగమ్ బిస్వజిత్ సింగ్ దానిని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర బిజెపి నాయకులతో పంచుకున్నారు. 'చదువు పట్ల ఆమెకున్న అంకితభావం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది' అంటూ ట్విట్టర్‌లో తన విస్మయాన్ని వ్యక్తం చేశాడు. వెంట‌నే పాప‌ కుటుంబాన్ని గుర్తించి, ఆమెను మ‌ణిపూర్ రాజ‌ధాని ఇంఫాల్‌కు తీసుకురావాలని వారిని కోరారు మంత్రి. ఆమె గ్రాడ్యుయేట్ అయ్యే వరకు ఆమె చదువును తాను వ్యక్తిగతంగా చూసుకుంటానని రాష్ట్ర‌మంత్రి చెప్పారు. "ఆమె అంకితభావానికి గర్వపడుతున్నాను" అని మంత్రి తెలిపారు.


Next Story

Most Viewed