'భారత్‌లో చదువుకునేందుకు అవకాశం కల్పించండి'

by Disha Web Desk 2 |
భారత్‌లో చదువుకునేందుకు అవకాశం కల్పించండి
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా చేస్తు్న్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్ దేశం అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులంతా చదువు మధ్యలో ఆపివేసి వెనుదిరిగారు. దీంతో చదువు మధ్యలోనే ఆగిపోతుందన్న భయంతో ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులంతా కలిసి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వదేశంలో చదువుకునే అవకాశం కల్పించాలని దాదాపు నాలుగు రాష్ట్రాల విద్యార్థులు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక విద్యార్థులు సుప్రీంకోర్టులో విటిషన్ దాఖలు చేశారు. మధ్యలో ఆగిపోయిన చదువులను స్వదేశంలో పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. సుమారు రెండు వేల మందికి న్యాయం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.



Next Story

Most Viewed