- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్.. ఆ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా!
రాంచీ: దాణా స్కాంలో ఐదో కేసులోనూ దోషిగా తేలిన లాలూ యాదవ్‌కు కోర్టు సోమవారం ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతో పాటు రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. గత వారమే రాష్ట్రీయ జనతాదళ్ నేతను కోర్టుగా దోషిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. డోరండా ట్రెజరీ లావాదేవీల్లో రూ.139.5 కోట్లు అవకతవకలకు పాల్పడ్డనే కేసులో రాంచీలోని స్పెషల్ సీబీఐ కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది.
1990లో లాలూ సీఎంగా ఉన్న సమయంలో దాణా స్కాం అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూను దోషిగా నిర్ధారించింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన లాలూతో పాటు మరో 40 మంది దోషులుగా తేలారు. అయితే అనారోగ్య కారణాలతో బెయిల్‌పై ఉన్న లాలూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హజరయ్యారు.
ఇప్పటికే మూడేళ్లకు పైగా శిక్షను అనుభవించిన లాలూకు తాజా కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని డిఫెన్స్ న్యాయవాది అనంత్ కుమార్ విజ్ తెలిపారు. కాగా ఈ స్కాంలో మరో కేసు పాట్నా సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇది భగల్‌పూర్ ట్రెజరీ నుంచి అక్రమంగా లావాదేవీలు జరిపారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సంచలనం రేపిన దాణా స్కాం లో పెద్ద ఎత్తున రూ.950 కోట్ల అవినీతి జరగడం దేశవ్యాప్తంగా మార్మోగిన సంగతి తెలిసిందే. కాగా ఛాయ్ బసా, దేవఘర్, దుమ్కా ట్రెజరీల్లో అవకతవకలకు పాల్పడ్డట్లు నాలుగు కేసులో దోషిగా తేలారు.