మహిళైతే కాంగ్రెస్ నేత ఇలా చేస్తాడా.. మండిపడుతున్న ఎంపీటీసీలు

by Dishafeatures2 |
మహిళైతే కాంగ్రెస్ నేత ఇలా చేస్తాడా.. మండిపడుతున్న ఎంపీటీసీలు
X

దిశ, ఖమ్మం రూరల్​ : మైనార్టీ మహిళననే నాపై మంగళగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్​ నాయకుడు కన్నేటి వెంకన్న విష ప్రచారం చేశాడని, ఎంపీటీసీ షేక్ సైదాబీ, ఆమె భర్త సొంధుమియా విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం రూరల్​ మండల పరిషత్​ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ నాయకుడు కన్నేటి వెంకన్న తన భార్యపై అసభ్యంగా అసత్య ప్రచారాలు చేశాడని భర్త సొందుమియ్యా ఆవేదన వ్యక్తం చేశాడు.

మైనారిటీ వర్గానికి చెందిన మహిళ వ్యక్తిత్వాన్ని హేళన చేసిన కన్నేటి వెంకన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. చేసిన అసత్య ఆరోపణల కారణంగా తాము ఆత్మహత్య చేసుకుందామనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మహిళా సర్పంచ్ యండపల్లి రాధిక ఎంపీటీసీలు, సైదాబీని ఓదార్చారు. మహిళా సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం బాధాకరం అన్నారు. ఏ ఒక్కరూ ఇటువంటి ఆరోపణలు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రూరల్​ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ.. కన్నేటి వెంకన్నకు తమ ఎంపీటీసీపై అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. గ్రామంలో పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఒక మహిళా ఎంపీటీసీపై ఎటువంటి ఆధారలు లేకుండా, అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. సదురు వెంకన్న ఇంటికి గురువారం ఎంపీటీసీ, తన భర్త, బంధువులతో కలిసి వెళ్లి ఈ ఆరోపణ రుజువు చేయాలని ప్రశ్నిస్తే.. వారిపై రాళ్లతో, కర్రలతో దాడి చేసినట్టు తెలిపారు.

కన్నేటి వెంకన్న చేసిన పని మంచిది అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు మరికొందరు నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మహిళలపై గౌరవం ఉంటే వారిని సస్పెండ్ చేసి నిరూపించుకోవాలిని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ మండల వైస్​ ఎంపీపీ గూడిబోయిన దరగయ్య, ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, తోట యశోద, తాళ్లపల్లి సంద్యరాణి, సర్పంచ్​లు తాటికొండ సుదర్శన్​, తేజావత్​ బాలు, గ​ణపారపు శ్రీను, మంకెన నాగేశ్వరరావు, అంజనేయులు, బోడ్డు నర్సయ్య తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed