భారత టాప్-10 'ఉమెన్ లీడర్' జాబితాలో కిరణ్ మజుందార్-షా మొదటి స్థానం!

by Disha Web Desk 17 |
భారత టాప్-10 ఉమెన్ లీడర్ జాబితాలో కిరణ్ మజుందార్-షా మొదటి స్థానం!
X

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనికేషన్స్ సంస్థ విజికీ తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్‌లో ఎక్కువగా చర్చలో ఉన్న 'ఉమెన్ లీడర్' జాబితాలో ప్రముఖ బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె తర్వాత బ్యూటీ ఉత్పత్తుల సంస్థ నైకా సీఈఓగా ఫల్గుణి నాయర్ రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో కీలక స్థానాల్లో ఉన్న మహిళల గురించి విజికీ స్కోర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ నెల 8న మహిళల దినోత్సవం పురస్కరించుకుని భారత్‌లో అత్యంత ప్రభావవంతమైన మహిళా బిజినెస్ లీడర్ల జాబితాను విజికీ ప్రకటించింది. ఇందులో కిరణ్ మజుందార్-షా, నైకా ఐపీఓ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఫల్గుణి నాయర్, వీరిద్దరి తర్వాత సేల్స్‌ఫోర్స్ ఇండియా సీఈఓ అరుంధతి భట్టాచార్య మూడో స్థానంలో ఉన్నారు. ఆమె ఇటీవలే తన 'ఇండోమిటబుల్; ఎ వర్కింగ్ ఉమెన్స్ నోట్స్ ఆన్ లైఫ్, వర్క్ అండ్ లీడర్‌షిప్' పుస్తకాన్ని ప్రచురించారు.

ఐదో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఎండీ, సీఈఓ అంజలి, భసాల్, బైజూస్ సహ-వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్, ఆరో స్థానంలో ఛానెల్ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఏడో స్థానంలో, లుపిన్ లేబొరేటరీస్ సీఈఓ వినీతా గుప్తా ఎనిమిదో స్థానంలో, లుపిన్ లేబొరేటరీస్ వ్యవస్థాపకురాలు రేణుకా రామ్‌నాథ్, భారత్ బయోటెక్ సహ-వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా జాబితాలో చోటు సంపాదించారు. 'భారత మహిళా పారిశ్రామికవేత్తలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారని విజికీ సహ-వ్యవస్థాపకురాలు ఆకృతి భార్గవ అన్నారు.



Next Story

Most Viewed