కేఎఫ్‌సీ న్యూ 'చాక్లెట్ మింట్' డిప్.. సోషల్ మీడియాలో వైరల్‌

by Nagaya |
కేఎఫ్‌సీ న్యూ చాక్లెట్ మింట్ డిప్.. సోషల్ మీడియాలో వైరల్‌
X

దిశ, ఫీచర్స్ : KFC ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్‌లో లభించే చికెన్ స్టార్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, రొటీన్‌కు భిన్నంగా దక్షిణ కొరియాలోని కేఎఫ్‌సీ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్స్‌ చికెన్‌ను డిప్ చేసుకుని తినే కొత్త రకమైన మింట్ చాక్లెట్ డిప్‌ను పరిచయం చేశాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫుడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దక్షిణ కొరియన్లు ప్రస్తుతం 'మింట్ చాక్లెట్' రుచికి ఫిదా అయిపోతున్నారు. దీంతో పలు స్థానిక కంపెనీలు ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 'స్టార్‌బక్స్ కొరియా, హైటై కన్‌ఫెక్షనరీ, ఫుడ్స్ లేదా ఓరియన్' వంటి ప్రధాన కంపెనీలు తమ లైనప్స్‌కు పుదీనా చాక్లెట్ ఫ్లేవర్ ప్రొడక్ట్స్ జోడించాయి. తాజాగా ఈ జాబితాలో ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం కేఎఫ్‌సీ కూడా చేరింది.

లోకల్ ఫుడ్ డెలివరీ యాప్ 'బేమిన్‌'తో కలిసి మింట్ చాక్లె్ట్ ఫ్లేవర్ డిప్‌ను రూపొందించింది కేఎఫ్‌సీ. ఇది ఆగస్టు 8 వరకు KFC బ్రాంచెస్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. దీంతో ఈ రుచిని ఆస్వాదించేందుకు ప్రజలు ప్రయత్నిస్తుండగా.. ఇప్పటికే రుచి చూసినవారిలో చాలా మంది టూత్‌పేస్ట్ మాదిరిగా ఉందని విమర్శిస్తున్నారు. ఏదేమైనా మింటీ డిప్ ఒక్కో టబ్‌కు 900 కొరియన్ వోన్($0.70) ధర నిర్ణయించగా.. ఇది వివిధ కాంబో మీల్స్‌లో భాగంగా అందుబాటులో ఉంది.

'KFC ప్రసిద్ధ చికెన్, బర్గర్స్‌తో కూడిన బేమిన్ మింట్ చాక్లెట్ డిప్‌తో సరికొత్త అనుభవాన్ని పొందగలరని ఆశిస్తున్నాము' అని కేఎఫ్‌సీ దక్షిణ కొరియా అధికారి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed