పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరుతా: వైసీపీ ఎమ్మెల్యే

by Disha Web |
పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరుతా: వైసీపీ ఎమ్మెల్యే
X

దిశ, ఏపీ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతానని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేసిన ఓడిస్తానని అందులో సందేహం లేదన్నారు. కాకినాడలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కాకినాడలో పోటీ చేస్తానంటే సంతోషిస్తానని చెప్పుకొచ్చారు.

కాకినాడ కాకుండా జిల్లాలో మరెక్కడ నుంచి పోటీ చేసిన ఓడించి తీరుతానని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఇన్‌చార్జిగా వ్యవహరించి ఓడిస్తానని శపథం చేశారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడలో కొందరు చెంచాలు చెప్పే మాటలు నమ్మి పవన్ కల్యాణ్ తనపై విమర్శలు చేస్తున్నారని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని చంద్రశేఖర్‌రెడ్డి హితవు పలికారు. జనసేన కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్ అన్యాయం చేస్తున్నారని.. ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. త్వరలోనే జన సైనికులు బాధపడే రోజు వస్తుందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి నేతలు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని పవన్ కల్యాణ్‌కు సూచించారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపొటు పొడిచిన చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌కు వెన్నుపోటు పొడవడం ఓ లెక్కా అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed