700 ఏళ్ల తర్వాత ఓరుగల్లు గడ్డకు కాకతీయ వారసులు

by Disha Web Desk 2 |
700 ఏళ్ల తర్వాత ఓరుగల్లు గడ్డకు కాకతీయ వారసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కాకతీయుల వైభవాన్ని నేటి తరాలకు తెలియజెప్పాలనే సదుద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కాకతీయ వైభవ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 700 ఏళ్ల తర్వాత ఓరుగల్లు గడ్డకు కాకతీయ వారసులు రావడంతో కాకతీయుల వైభవాన్ని చాటిచెప్పేలా తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కాకతీయ ఉత్సవాలకు 22వ తరం కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 700 మంది కళాకారులతో మహా ప్రదర్శన నిర్వహించారు. డప్పు, డోలు కళాకారులతో కమల్ చంద్రకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు పాల్గొని కాకతీయుల వారసుడికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed