జూబ్లీహిల్స్ ప్రమాదం కేసులో కీలక మలుపు.. కారులోనే ఎమ్మెల్యే షకీల్ కొడుకు !

by Disha Web Desk |
జూబ్లీహిల్స్ ప్రమాదం కేసులో కీలక మలుపు.. కారులోనే ఎమ్మెల్యే షకీల్ కొడుకు !
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైనా జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదానికి కారణమైన కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో.. అది ఆయన కారేనని, కారుని డ్రైవ్ చేసింది షకీల్ కొడుకు రాహిల్ అని ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన షకీల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. వీడియాలో ఆ కారు తనది కాదని.. తన కజిన్ మీర్జాది అని, అప్పుడప్పుడు ఆ కారు వాడుతుంటానని అందుకే ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ప్రమాదం జరిగినప్పుడు అసలు ఆ కారులో తన కొడుకు లేడని చెప్పారు.

అయితే, ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. కారులో మొత్తం ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. అందులో సంతోశ్‌నగర్‌కు చెందిన అప్నాన్, మాజిద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ఉన్నట్లు తెలుసుకున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి శనివారం ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. ఇన్ఆర్బిట్ మాల్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. వీరు ముగ్గురు విద్యార్థులేనని, హైదరాబాద్‌లోనే ఉంటారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే రాహిల్, అఫ్నాన్, మాజిద్‌‌లు పరారయినట్లు చెప్పారు. శనివారం ఉదయం అఫ్నాన్, మాజిద్‌‌లు పోలీసులకు లొంగిపోయారని చెప్పారు. వీరిని విచారించగా.. అఫ్నాజ్ డ్రైవ్ చేసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు. ఫింగర్ ప్రింట్స్, సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత అఫ్నాజ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, షకీల్ కొడుకు రాహిల్ ఆచూకీ కోసం తనీఖీలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కానీ, శుక్రవారం ఎమ్మెల్యే విడుదల చేసిన వీడియోలో మాత్రం తన కొడుకు లేడని తప్పుడు సమాచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story

Most Viewed