IT Rides: హైదారాబాద్‌లో ఐటీ దాడులు.. పవర్ మేక్ కంపెనీల్లో సోదాలు

by Disha Web Desk 4 |
IT Rides In Power Make Corporate Office
X

దిశ, డైనమిక్ బ్యూరో: IT Rides In 'Power Make Corporate' Office| హైదారాబాద్ నగరంలో ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. బుధవారం నాడు ఐటీ అధికారులు పవర్ మేక్ కార్పోరేట్ ఆఫీసులో సోదాలు నిర్శహించినట్లు సమాచారం. ట్యాక్స్ చెల్లింపులపై అవకతవకల ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఉన్న పవర్ మేక్ కంపెనీల్లో ఐటీ దాడులు చేపట్టింది. విద్యుత్ ఉత్పాదక, ఐటీ, ఇన్ ఫ్రా, మైనింగ్ రంగాల్లో పెట్టుబడుల వివరాలను సేకరిస్తుంది. అంతే కాకుండా, ఇండియాతో పాటు సౌది దేశాల్లో ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపింది. కాగా, సోమవారం నాడు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో దాడులు నిర్వహించింది. హైదరాబాద్, బెంగుళూర్, చెన్నైలలో ఉన్న 40 కి పైగా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం నాటికి, దాడుల్లో రూ.3.50 కోట్ల నగదు, బంగారం, వెండితో సహా రూ.18.50 కోట్ల విలువైన డబ్బు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: కేసీఆర్ పాలనలో పేద పిల్లల చదువులకు 'చంద్ర గ్రహణం'

Next Story

Most Viewed