మార్చి 17 స్పెషల్.. బర్త్ కంట్రోల్ క్లినిక్‌పై ఆసక్తికర నిజాలు

by Disha Web |
మార్చి 17 స్పెషల్.. బర్త్ కంట్రోల్ క్లినిక్‌పై ఆసక్తికర నిజాలు
X

దిశ, ఫీచర్స్: సరిగ్గా 101 ఏళ్ల క్రితం అంటే మార్చి 17, 1921న సోషల్ యాక్టివిస్ట్ మేరీ స్టోప్స్ ఇంగ్లాండ్‌లో మొదటి ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్‌ను స్థాపించింది. భర్త హంఫ్రీ వెర్డాన్‌నోతో కలిసి 'ది మదర్స్ క్లినిక్ ఫర్ కన్‌‌స్ట్రక్టివ్ బర్త్ కంట్రోల్' అని పిలువబడే జనన నియంత్రణ ఆసుపత్రిని ప్రారంభించింది. ఇక్కడ వివాహిత మహిళలందరికీ జనన నియంత్రణ పద్ధతులు, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ఉచితంగా అవగాహన కల్పించేవారు. మానవజాతిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బర్త్ కంట్రోల్ క్లినిక్‌ను స్థాపించగా.. ఇందుకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. 1. పేదలకు సాయం చేయడం 2. జనన నియంత్రణ పట్ల కార్మికవర్గ వైఖరి తెలుసుకోవడం 3. గర్భనిరోధకంపై డేటాను సేకరించడం 4. స్త్రీల లైంగికత గురించి జ్ఞాన పరిధిని విస్తృతం చేయడం.

Next Story

Most Viewed