మిస్సైల్ ప్రయోగం.. భారత్‌పై పాక్ ప్రతిదాడికి ప్రణాళికలు!

by Disha Web Desk 17 |
మిస్సైల్ ప్రయోగం.. భారత్‌పై పాక్ ప్రతిదాడికి ప్రణాళికలు!
X

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోకి పొరపాటున వెళ్లిన భారత మిస్సైల్‌పై ఓ నివేదిక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. భారత్ ప్రమాదవశాత్తు చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ సిద్ధమైందని పేర్కొంది. అయితే, ప్రాథమిక అంచనాలో ఏదో తప్పు జరిగిందని సూచించినందున పాకిస్తాన్ వెనక్కి తగ్గిందని, పేరు వెల్లడించని నివేదిక పేర్కొంది. ఈ నెల 9న హార్యానా అంబాలా నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు విడుదలై పాకిస్తాన్ లోని పౌర నివాసాలను ధ్వంసం చేసింది. అయితే భారత్ ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని, ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పార్లమెంట్ లో వివరణ ఇచ్చారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ, దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాగా, అంతకుముందే పాక్ భారత్‌ను ఈ అంశంపై ఉమ్మడి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఈ విషయంలో భారత్ వాదనకు యూఎస్ మద్దతు ఇచ్చింది. ప్రభుత్వం కూడా సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగిందని పేర్కొంది.



Next Story