భారత్, అమెరికా మెగా సైనిక విన్యాసాలు

by Disha Web Desk 7 |
భారత్, అమెరికా మెగా సైనిక విన్యాసాలు
X

న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య రెండు వారాలపాటు సాగే మెగా సైనిక విన్యాసాలు రెండువారాల పాటు జరగనున్నాయి. చత్తీస్‌గఢ్‌లో అక్టోబర్ 14 నుంచి 31వ తేదీవరకు ఇరుదేశాల మధ్య 18 ఎడిషన్ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలను చేపడుతున్నట్లు భారత రక్షణ, సైనిక వ్యవస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మెగా ఎక్సర్‌సైజులో భాగంగా అనేక సంక్లిష్టమైన డ్రిల్స్‌ను నిర్వహిస్తామని చెప్పారు. ఇరుదేశాల మధ్య చివరిసారిగా అమెరికాలోని అలస్కాలో 2021 అక్టోబర్‌లో ఈ మెగా డ్రిల్‌ని నిర్వహించినట్లు తెలిపారు. తూర్పు లడఖ్‌లో చైనాతో భారత్ సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య యుద్ధ్ అభ్యాస్ ఎక్సర్‌సైజ్ జరుగనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

గత కొన్ని సంవత్సరాలుగా ఇరుదేశాల మధ్య రక్షణ బంధాలు కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో భారత్‌లో జరగనున్న ఈ సంయుక్త విన్యాసాల్లో భాగంగా భారత్, అమెరికా సైన్యాల మధ్య అవగాహనను, సహకార భావనను, పరస్పర చర్యలను విస్తరించుకోవడం లక్ష్యంగా ఈ సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇరుదేశాలు గత కొన్నేళ్లుగా పలు కీలకమైన రక్షణ, భద్రతాపరమైన ఒడంబడికలను కుదుర్చుకున్నాయి. వీటిలో 2016లో కదుర్చుకున్న, ఇరుదేశాల సైనిక స్థావరాలను పరస్పరం ఉపయోగించుకునే లాజిస్టిక్స్ ఎక్చేజ్ మెమరాండమ్ అగ్రిమెంట్ కూడా ఉంది.


Next Story

Most Viewed