అక్రమ బదిలీల దందా..? కీలక పాత్ర పోషిస్తున్న సదరు అధికారి..!

by Dishanational1 |
అక్రమ బదిలీల దందా..? కీలక పాత్ర పోషిస్తున్న సదరు అధికారి..!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీల దందాకు తెరలేపారు. నేతల సిఫారసుతో నిబంధనలను తుంగలో తొక్కతున్నారు. 317 జీవోకు వక్రభాష్యం చెబుతూ ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు పెద్ద ఎత్తున అక్రమ బదిలీలు చేస్తున్నారు. రంగారెడ్డి జల్లాలకు ఆరుగులు, మేడ్చల్ జిల్లాకు ముగ్గురు టీచర్లను అక్రమంగా బదిలీ చేశారు. వీరిలో ఇప్పటికే కొందరికి పోస్టింగ్ లు ఇవ్వగా మరికొందరు ఆ ప్రయాత్నాల్లో నిమగ్నమయ్యారు.




గుట్టుచప్పుడు కాకుండా..

నల్గొండ జిల్లా నుంచి వచ్చిన టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మణిపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడికి సరూర్ నగర్, ఎన్టీఆర్ నగర్ పోస్టింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా నుంచి వచ్చిన ప్రసన్న అనే ఉపాధ్యాయురాలికి కాప్రా బాలాజీనగర్ లో పోస్టింగ్ ఇచ్చారు. వికారాబాద్ నుంచి వచ్చిన హేమలత అనే ఉపాధ్యాయురాలికి దుండిగల్ మండలం నిజాంపేటలో పోస్టింగ్ ఇచ్చారు. మరో ఉపాధ్యాయురాలు కె. వరలక్ష్మికి నిబంధనలకు విరుద్దంగా ఘట్ కేసర్ మండలంలోని ఫిర్జాదిగూడలో పోస్టింగ్ ఇచ్చారు. ఇలా ఇటీవల తొమ్మది మంది టీచర్లను అక్రమంగా బదిలీ చేసినట్లు సమాచారం. వీరిలో కొందరికి గుట్టుచప్పుడు కాకుండా పోస్టింగ్ లు ఇచ్చారు. ఉత్తర్వుల కాపీలను విద్యాశాఖ అధికారులు సైతం బయట పెట్టడడంలేదు. టీచర్ల అక్రమ బదిలీలలో మేడ్చల్ జిల్లాలో విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ అధికారి కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ బదిలీలలలో భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించినట్లు ఉపాధ్యాయ సంఘాల ఆరోపిస్తున్నాయి.

మధ్యాహ్నం 2 గంటలకు ధర్నా..

అక్రమ ఉపాధ్యాయ బదీలలను నిరసిస్తూ.. శనివారం మధ్నాహ్నం 2 గంటలకు ధర్నా నిర్వహించేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి రావాలని పిలుపునిచ్చాయి. 317 జీవోకు వక్రభాష్యం చెబుతూ.. భారీ ఎత్తున అధికారులు ముడుపులు తీసుకుని బదిలీలు చేస్తున్నారని మండిపడుతున్నారు. నేతల సిఫారసులతో అక్రమ బదిలీలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఆందోళన కార్యక్రమాన్ని విజయం వంతం చేయాలని, అక్రమ బదిలీలను అడ్డకుందామని పిలుపునిస్తున్నారు.



Next Story

Most Viewed