వ‌క్రాసనం ఎలా చేయాలి? ఉపయోగాలేమిటి?

by Disha Web |
వ‌క్రాసనం ఎలా చేయాలి? ఉపయోగాలేమిటి?
X

దిశ, ఫీచర్స్ : మొదట రెండు కాళ్లను ముందుకు చాపి, వెన్ను నిటారుగా పెట్టి కూర్చోవాలి. తర్వాత ఒక మోకాలిని మడిచి, మరో పాదాన్ని మడిచిన మోకాలికి అవతలివైపు వచ్చేలా పెట్టాలి. ఏ కాలైతే వంచామో దానికి వ్యతిరేకంగా ఉన్న చేతిని కాలిమీదుగా పెట్టి పాదాన్ని లేదా కాలి బొటనవేలును పట్టుకోవాలి. వీలైనంత వరకు శరీరాన్ని అటువైపుగా తిప్పాలి. ఇదే మాదిరిగా రెండో కాలిని మడిచి మరలా అదేవిధంగా చేయాలి. ఇలా కనీసం మూడుసార్లు కుడి వైపు, మూడుసార్లు ఎడమ వైపు తిప్పాలి. అలాగే ఈ పొజిషన్‌లో కనీసం 20 సెకన్లకు ఆగి వీలైనంత శ్వాస తీసుకుంటూ వదలాలి.

ప్రయోజనాలు:

* వెన్ను దృఢంగా మారుతుంది.

* పొట్ట, న‌డుము, పిరుదుల దగ్గర కొవ్వు క‌రుగుతుంది.

* అధిక బ‌రువు త‌గ్గుతారు.

Next Story

Most Viewed