వృశ్చికరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

by Disha Web Desk 19 |
వృశ్చికరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
X

విశాఖ 4 (తో); అనూరాధ 1,2,3,4 (నా,నీ,నూ,నే) జ్యేష్ఠ 1,2,3,4 (నో,యా,యి,యు)

ఆదాయం-14

వ్యయం-14

రాజపూజ్యం -3

అవమానం-1

ఈ రాశి వారికి గురువు 13.04.2022 వరకు చతుర్థములో తామ్రమూర్తిగాను ఉండును. తదుపరి వత్సరాంతము వరకు పంచమములో కూడా తామ్రమూర్తిగాను ఉండను. శని తృతీయమున తామ్రమూర్తిగా 29.04.2022 వరకు అప్పటి నుండి 12.07.2022 వరకు చుతుర్థములో రజతమూర్తిగా, తదుపరి తృతీయములో 17.01.2023 వరకు సువర్ణమూర్తిగా తరువాత చుతుర్థములో సువర్ణమూర్తిగాను గోచరించును. రాహువు సప్తములో కేతువు జన్మమందు తామ్రమూర్తులుగా ఉందురు. ఏదో తెలియని అభద్రతా భావము ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువంటి సాహస నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. సహసము. ఓర్పు ఇవి అలవరుచుకోవాలి. చాలా కాలంగా ఉన్న సహనానికి ఒక పరీక్షా సమయము ఎదురుకావచ్చు. కాని మిమ్ములను అనేక విధాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీరు చేసే పొరపాటును తమకు అనుకూలంగా త్రిప్పుకునే ప్రయత్నాలు జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త. పని భారము మానసిక వత్తిడి పెరగవచ్చును. సహోద్యోగులు తమ క్రింద పనిచేసే వారు తమ మాటను పూర్తిగా వినక, పై అధికారులకు జవాబు చెప్పలేక సతమతమవుతారు. గృహంలో కూడా ఒక విధమైన సహకార లోపం ఏర్పడవచ్చును. క్రోధం తగ్గించుకోవాలి. అనవసర ఆవేశము అనర్థాలకు హేతువు కావచ్చును. వాహనములు నడుపునపుడు పరధ్యానము, అజాగ్రత్త ఏ మాత్రం శ్రేయస్సు కాదు. ఇంటర్నెట్ ఉపయోగంలో కూడా నియంత్రణ అవసరము. చాలా రహస్యాలు ముఖాముఖిగా మాట్లాడుకోవడం ఉచితము.

తమను ఎక్కువగా ఇష్టపడే వారిని నిర్లక్ష్యము చేయడం, నిర్లక్ష్యం చేసేవారి కోసం వెంటపడడం, వారికి అనేక విధాలుగా సహాయమందించడం చేస్తారు. కాని తమ ప్రయత్నానికి గుర్తింపుగాని, ఫలితముగాని ఉండకుండా పోతుంది. తమ పరబేధాన్ని గుర్తించండి. అనుబంధాలకు విలువనివ్వండి. ఏండమావులకై ఆరాటపడకండి. బంధువులతో అకారణ ద్వేషాలు, వివాదాలు చిరాకు కల్గిస్తాయి. తమ ప్రయత్నాలలో ఫలితము చేతికందినట్లే అంది జారిపోవడం మానసిక వ్యధకు కారణమవుతుంది. విలాసవంతమైన, ఖరీదైన గృహోపకరణాలు, అలంకార వస్తువులు అప్పు చేసైనా కొనుగోలు చేస్తారు. ఎదుటివారి ముందు తాము ఏమిటో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. విషమ పరిస్థితులలో కూడా తమ ఆత్మ విశ్వాసమును ధైర్యాన్ని తగ్గనీయరు. ఆకలితో ఉన్నా సింహం గడ్డితినదని, మీ ప్రవర్తన ద్వారా నిరూపిస్తారు. స్త్రీ విబేధాలు కనపడుచున్నవి. సంవత్సరము ఉత్తరార్థంలో వివాహ ప్రయత్నాలు సఫలము కావచ్చును. కుల దేవతారాధన చేస్తారు. అనుగ్రహము పొందుతారు.ధనం సంపాధించినట్లు కనపడినా చేతిలో అవసరానికి ధనం ఉండదు. లోకం దృష్టిలో ధనవంతులు. నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ఉంటుంది. నరఘోష విపరీతంగా ఉన్నది.

శతృవులపై అధిపత్యానికై వారిని అదుపు చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నించాల్సి వస్తుంది. స్థిరాస్థి అమ్మకానికి పెడతారు. అయితే ఆ ప్రయత్నం కొంత వాయిదా పడవచ్చు. కార్యరూపం దాల్చవచ్చును. స్థిరాస్థిని తప్పని పరిస్థితులలో అ యిష్టముగా అమ్మకానికి పెట్టవలసిన పరిస్థితులు రావచ్చును. విలువైన వస్తువులను భద్రపరచుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. మీ ముందు నిలబడే అర్హతలేనివారు కూడా మీకు సలహాలు ఇవ్వడము ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఉద్యోగంలో మాత్రం తొందరపాటు చర్యలు ఉండరాదు. కొందరికి తమ స్వయంకృతాపరాధములే రావలసిన ప్రయోషన్లు రాకపోవడం తమకన్నా తక్కువ స్థాయివారు అందల మెక్కడం మనో వేదనకు కారణం అవుతుంది. అధికారుల నుండి తగిన గుర్తింపు ప్రోత్సాహము లభించును. ఎవరో చేసిన తప్పుకు తాము సంజాయిషీ చెప్పవలసిన స్థితి ఏర్పడుతుంది. చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వారు దరికి చేరకుండా ముందే గ్రహించి దూరం ఉంచండి. ప్రలోభాలకి లొంగి ప్రతిష్టను భంగపరచుకోవద్దు. ఊహలు తారు మారు కావచ్చును. గృహములో ఏదో తెలియని అశాంతి. బంధువుల అనారోగ్యము అరిష్ట సూచనలున్నాయి.



Next Story