మిధున రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

by Dishafeatures2 |
మిధున రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
X

మృగశిర 3,4(కా,కి); ఆర్ర్ధ 1, 2, 3, 4 (కు, ఖం, ఙ్ణ, చ్ఛ), పునర్వసు 1, 2, 3, (కె,కో,హ)

ఆదాయం-11

వ్యయం-5

రాజపూజ్యం-2

అవమానం-2

ఈ రాశి వారికి గురువు 9వ స్థానంలో లోహమూర్తిగా 13.04.2022 వరకు ఉండును. తదుపరి వత్సరాంతము వరకు 10వ స్థానంలో తామ్రమూర్తిగాను ఉండును. శని 29.04.2022 వరకు 8వ స్థానంలో లోహమూర్తిగాను, తదుపరి 12.07.2022 వరకు తామ్రమూర్తిగా 9వ స్థానంలో ఉండును. తదుపరి 8వ స్థానంలో తామ్రమూర్తిగా 17.01.2023 వరకు ఉండును. తదుపరి 9వ స్థానంలో సువర్ణమూర్తిగాను సంచరించును. రాహు-కేతువులు 12-6 స్థానములలో 12.04.2022 వరకు ఉండును. తదాద్యా వత్సరము 11-5 రాశులలో తామ్రమూర్తులుగాను సంచరించును. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉండవచ్చును.

స్థిరాస్తి మరియు ఆర్థిక స్థితి అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించే సూచనలున్నాయి. విద్యార్థుల విద్యా ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలను కనబరిచే అవకాశం. ఉన్నత విద్యను అభ్యసించే విషయంలో పోటీ అధికంగా ఉన్నప్పటికీ ప్రయాసతో ఫలితము సాధించవచ్చు. కుటుంబం మరియు పెద్దల విషయంలో మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టు సంబంధిత వ్యవహారాల్లో శుభ సూచనలు కనిపించవచ్చు. సేవా కార్యక్రమాల్లో మీ వంతు సహాయం చేసే అవకాశాలున్నాయి. బ్యాంకు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. చిరు తిండ్లకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది.

రాజకీయ పరమైన అంశాల్లో, కార్యక్రమాల్లో కొంచెం అనుకూల ఫలితాలు ఉండవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత సన్నగిల్లే అవకాశాలున్నాయి. వివాహ విషయాల్లో పెద్దల మాటను వినడం చాలా వరకు శ్రేయస్కరం. సేవా కార్యక్రమాల్లో మీ వంతు కృషి అందచేస్తారు. ఇతరుల నుంచి సలహాలు, సహాయం తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ సన్నిహితులకు, ఆత్మీయులకు మంచి చేయాలని ఆలోచిస్తారు. కుటుంబ సంబంధిత విషయాల్లో కొంత మేర ఒడిదొడుకులు వచ్చినప్పటికి మీ నైపుణ్యంతో చక్కదిద్దుకోగలుగుతారు. గతంలో అనుభవించిన కష్టములను గుర్తుచేసుకొని ప్రస్తుతం ఉన్న మంచి సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి.

ఇంకా పరోక్ష శత్రువులతో సమస్యలు, నరఘోష, ఈర్ష్యాద్వేషాలు మీ వెంటనే ఉన్నాయని గ్రహించండి. అతి మంచితనం మన మోసకారులను నమ్మడం వలన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అతి మంచితనం మీ మనోవ్యాధికి కారణమని గ్రహిస్తారు. తమ అభివృద్ధిని చూసి ఈర్ష్య పడే వారిని గుర్తిస్తారు. వాహనములు నడుపే సమయంలో జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గతము కంటే మెరుగు అవుతుంది. ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్, ఇతర పన్నులు చెల్లించడంలో అలసత్వం పనికిరాదు. మీ వలన అనేక రకాలుగా అభివృద్ధి చెందిన వారు ఈవేళ కనీసం మీ ముఖం కూడా చూడకపోవడం మనోవేదనకు కారణమవుతుంది. భగవంతుడు ఉన్నాడనే నమ్మకం.

ఎప్పుడైనా న్యాయము జరుగకపోతుందా అనే విశ్వాసంతో ముందుకు వెళ్తారు. తొందరపడి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలి. ఒక విశేషమైన ఆశయసిద్ధికి నిర్విరామ కృషి చేస్తారు. తనవారే అనుకున్నవారు పరోక్ష వ్యతిరేకులుగా మారటం భరించలేకపోతారు. శుభకార్యాలు వైభవంగా ఆరాటపడుతున్నామనే నిజాన్ని గ్రహిస్తారు. అదృష్టం లేదని మనసుని సంతృప్తి పరచుకుంటారు. శుభకార్యాలు వైభవంగా చేస్తారు. కానీ చివరి నిమిషంలో నిష్టూరాలు తప్పవు. ఋణాలకై ఆరాటపడకూడదు. అడగకున్నా అప్పు దొరకడం వెనుక ఏదో అంతరార్ధం ఉన్నదని గ్రహించండి. దుష్ట ప్రయోగాల భయం వెంటాడటం గమనించగలరు. వీలు అయినంత వరకు అతి వినయం గల వారిని దూరంగా ఉంచండి. మీ బలహీనతలను, మీ రహస్యాలను గమనించే అవకాశం కలదు. వత్తిడిని అధిగమించటానికి మరొక్క దారిని వెతకటం వలన అపకీర్తి వచ్చే అవకాశం కలదు. దైవ ధాన్యం యోగా చేయండి.


Next Story

Most Viewed