మకరరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

by Disha Web Desk 19 |
మకరరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
X

ఉ.షా 2, 3, 4 (భో, జా, జీ) శ్రవణం 1, 2, 3, 4 (జూ,జె,జో,ఖ), ధనిష్ట 1, 2 (గా,గీ)

ఆదాయం -5

వ్యయం -2

రాజపుజ్యం -2

అవమానం -4

ఈ రాశి వారికి గరువు ద్వితీయంలో 13.04.2022 వరకు రజతమూర్తిగా ఉండును.తదుపరి తృతీయములో లోహమూర్తిగాను ఉండును. జన్మమందు శని సువర్ణ మూర్తిగా 29.04.2022 వరకు ఉండును. తర్వాత 12.07.2022 వరకు ద్వితీయములో తామ్ర మూర్తిగా ఉండును. ఆ రోజు నుంచి 17.01.2023 వరకూ మరల జన్మమందు లోహ మూర్తిగాను ఉండును. తదుపరి ద్వితీయమందు సువర్ణమూర్తి గాను ఉండును. రాహువు, కేతువులు చతుర్థ, దశమ రాశులలో లోహమూర్తులుగా సంచరిందెదరు. ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా శుభ మిశ్రమ ఫలితములు కనపడుచున్నవి. సంవత్సరారంభంలో గురుబలము కొంత అనుకూలముగా ఉండును. పనుల యందు ఆలస్యము, తమ సహనానికి ఒక పరీక్షలాగా ఉండును. పితృ సంబంధ ఆస్తి పేరుపై మారుట, నూతన గృహ నిర్మాణ ఆలోచనలు, పనులన్నియు ఆలస్యముగా మిశ్రమ ఫలితంగా నెరవేరును. తొందరపాటు నిర్ణయాలు తీసుకొనరావు. శ్రేయోభిలాషుల సలహా కొంత మేలు చేయును. ధనము కాస్త ఆలస్యంగానైనా చేతికందుతుంది. కులాచార ప్రవర్తన ఏర్పడుతుంది.

స్వగృహ ప్రాప్తికై ఆరాటము. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. తల్లి ఆరోగ్యము ఇబ్బందికరముగా ఉండవచ్చును. ఔషధ సేవనము అవసరం కావచ్చును. స్ర్తీ సౌఖ్యము, అన్య పరిచయాలు ఏర్పడచ్చును. ధనము అనాలోచితముగా ఖర్చు చేసే అవకాశము గలదు. ధనాన్ని కాపాడుకోవడం లక్షణమని తెలుసుకోవాలి. వృథా భ్రమణం, స్వజనులచే దూషింపబడుట, గతంలో పొగిడిన వారే ఇప్పుడు విమర్శించుట ఆశ్చర్యానికి, వైరాగ్యానికి గురి చేస్తుంది. తమను అభిమానించే వారికి పిలువనివ్వక పోవడం, అభిమానించని వారికై పరితపించడం జరుగుతుంది. ఈ విషయంలో ఆశాభంగం కలుగవచ్చును. మే తరువాత పరిస్థితులు అర్థంగాని రీతిలో ఉండును. ఎదుటి వారికి సలహాలిచ్చి వారి అభివృద్ధికి కారణయిననవారు తమ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థితి ఏర్పవచ్చును. తనపై తనకు నమ్మకం తగ్గుట జరుగును. మతి మరుపు, కటి నుండి కంఠం వరకు ఒక రకమైన అనారోగ్యం వ్యాధి భయం ఏర్పడవచ్చును. ఔషధ సేవనం తప్పకపోవచ్చును. బంధుజనంతో విద్వేషాలు ఏర్పడే సూచనలు కలవు. జేష్ఠ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తారు. కానీ అందుకు ధనము సర్దుబాటు కొరకు అనేక ప్రయత్నాలు చేయవలసి వచ్చును. కార్యాచరణపై మనస్సు ఆకర్షిత మగును. తస్మాత్ జాగ్రత్త.. మధ్యవర్తిత్వం చేయి సమయమున చాలా ఓపిక తెలివిగా ప్రవర్తించుట అవసరం.

సంవత్సరాంతమందు కొంత పేరు ప్రతిష్ట వచ్చినను కేవలం మీ చేతి పనులు తీసుకోవడానికి మిమ్ములను పొగడుచున్నారని గ్రహిస్తారు. నాలుక అదుపులో ఉంచుకోవాలి జీవిత భాగస్వామిని ఆదరించండి. వారి మనస్సు గాయపరచకుండా ప్రవర్తించండి. తద్వారా అనేక శుభ ఫలితాలు పొందండి. శత్రువులపై తమదే ఆధిపత్యం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వచ్చుట. ప్రతి చిన్న పనికి ఎక్కువ మారులు ప్రయాణించుట జరుగును. మందబుద్ధి ఏర్పడే అవకాశాలు గలవు. సంపాదన ఖర్చు సమపాళ్లలో ఉంటుంది. కళత్ర విచారము జీవిత భాగస్వామితో తరచూ వివాదములు గృహంలో అశాంతికి మీరు కూడా కారణం కావచ్చు. అందుచేత మౌనేన కలహం నాస్తి మనుధర్మాన్ని పాటించండి. కొంతవరకు మీ తెలివితేటలతో శత్రువులపై ఆధిపత్యాన్ని పొందుతారు. శత్రు ధనాన్ని పొందడం జరుగవచ్చు. భార్య యొక్క లేదా భర్త యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.

సమయానికి వైద్యుడిని సంప్రదించాలి. నిర్లక్ష్యం పనికిరాదు. నరములకు సంబంధించిన బాధలు ఉండవచ్చును. ఆశాభంగం ఏర్పడవచ్చును. ప్రతి పనియందు తెలియని అసంతృప్తి ఎంత శ్రమించినా అందవలసిన ఫలము అందకపోవడం నైరాశ్యానికి గురిచేస్తుంది. నిద్రాభంగం అకాల భోజనం, ప్రతి పనిని అది పూర్తయ్యే వరకు ఈ రహస్యం పాటించాలి. నమ్మిన వారే మోసం చేసే ఉద్దేశంతో ఉన్నారనే విషయం తెలిసి బాధ పడతారు. తమ ఎదురుగా ఒక మాట చాటుగా మరో మాట మాట్లాడే వారిని చూసి లోకం లో ఈ విధమైన మనుషులు కూడా ఉంటారా అని ఆవేదన ఏర్పడుతుంది. ఏదో తెలియని అసంతృప్తి నిర్వేదం కాలం వృధాగా నడుస్తున్నదని భావన ప్రాణ స్నేహితులతో కూడా విభేదాలు వచ్చే అవకాశం. కుటుంబంలో ఒకరకమైన అశాంతి. ఈ రాశి ఉద్యోగస్తులకు సంవత్సర ఆరంభంలో కొద్దిపాటి అనుకూలతలు ఏర్పడవచ్చును. ప్రమోషన్లు ఇంకా అందవలసిన ప్రయోజనాలు పొందడానికి మీ విశేష కృషి అవసరం. ఉద్యోగ స్థాన చలనము, సూచనలు కలవు. ప్రతిక్షణం మీ నిజాయితీ మీ నైపుణ్యం చూపించు కొనవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు, నీ ముందు నిలబడే అర్హత లేనివారు కూడా అందలం ఎక్కడం ఆశ్చర్యాన్ని ఆవేదనను కలుగజేస్తుంది. మనము భ్రమణంలో ఉన్నాము.. కనుక తప్పదు. భగవధ్యానము సజ్జన సాంగత్యంలో ఈ రకమైన ప్రభావాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చును.

ఉపశమనం పొందవచ్చును. ప్రైవేటు సంస్థలలో పనిచేసే వారికి తరచూ ఉద్యోగం మారే స్థితి రావచ్చు. స్థిరంగా మనస్సు నిలువ లేకపోవడం జరుగవచ్చును కోపము ఆవేశము అదుపులో ఉంచుకొనుట శ్రేయస్సును ఇస్తుంది ఈ రాశి విద్యార్థులకు ఆరంభంలో అనుకూలంగా ఉన్నది. వృధా భ్రమణం, ఊహలలో విహరించడం, కాలయాపన వదిలి మీ విద్యపై దృష్టి పెట్టండి. చక్కని ఫలితాలు సాధించగలరు. సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ఉత్తముల లక్షణం. విదేశాలలో విద్యకై వెళ్ళు వారు విశేష కృషి చేయండి. అందుకు ఇదే తగిన సమయం అయితే ప్రయాసతో కార్య సాఫల్యం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కానీ ఏ ప్రదేశంలో సీటు ఒప్పుకోవాలి నిర్ణయం చేయలేక పోతున్నారు. మేధాశక్తిని జ్ఞాపకశక్తిని పెంచుకోండి. ప్రభుత్వ పరంగా కొంత అనుకూలత గలదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి తాము ఆశించినంత స్థాయి ఉన్న దానికి తగిన స్థాయి లభించును. విశేష కృషి చేయండి. శని శాంతి చేయండి. దేవి ఆరాధన చేయండి. అఖండ విజయం సాధించండి. వ్యాపారస్తులు ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి ఒంటరి పోరాటం.



Next Story

Most Viewed