జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తీవ్ర ఆవేదన.. 'ఆ పరిస్థితి చూస్తే నా గుండె పగిలిపోతుంది'

by Disha Web Desk 19 |
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తీవ్ర ఆవేదన.. ఆ పరిస్థితి చూస్తే నా గుండె పగిలిపోతుంది
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వల్ల శ్రీలంక దేశ ఆర్ధిక వ్యవస్థ భారీగా పతనమైంది. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. శ్రీలంక దేశ ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు దేశంలోని పరిస్థితులు చూసి ఆగ్రహంతో ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. దీనితో ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. శ్రీలంక ప్రజల దుర్భర పరిస్థితులపై బాలీవుడ్ హాట్ బ్యూటీ, శ్రీలంక దేశస్థురాలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పందించింది. ' ఒక శ్రీలంక దేశస్థురాలిగా, నా దేశ ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తే హృదయవిదారకంగా ఉంది. నా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే గుండె పగిలిపోతోంది. నా దేశం, దేశ ప్రజలు త్వరలోనే ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడుతారని ఆశిస్తున్నాను. కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న శ్రీలంక దేశ ప్రజలకు అపారమైన బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story

Most Viewed