75 రకాల ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం!

by Disha Web |
75 రకాల ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం!
X

న్యూఢిల్లీ: ఇటీవల భారత ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల(రూ. 30 లక్షల కోట్ల) లక్ష్యాన్ని అధిగమించాయి. దీంతో ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 500 బిలియన్ డాలర్ల(రూ. 38 లక్షల కోట్ల) ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎగుమతులను పెంచేందుకు దోహదపడే 75 ఉత్పత్తులను పరిశ్రమల సంస్థ పీహెచ్‌డీసీసీఐ సూచించింది. పీహెచ్‌డీసీసీఐ నివేదికను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని తొమ్మిది అత్యంత ఆశాజనకమైన రంగాలకు చెందిన 75 ఉత్పత్తులను గుర్తించింది. వాటిలొ వ్యవసాయం, ఇంధన, రసాయనాలు, అనుబంధ ఉత్పత్తులు, ఖనిజాలు, యంత్ర పరికరాలు, రవాణా/ఆటోమొబైల్, ఆప్టికల్ ఫోటోగ్రాఫిక్/సినిమాటోగ్రాఫిక్, మెటల్/నాన్-మెటల్స్, దుసులు, పాదరక్షలు సహా వివిధ ఉత్పత్తులు ఉన్నాయి.

ఈ 75 ఉత్పత్తులన్నీ భారత మొత్తం ఎగుమతుల్లో రూ. 9.70 లక్షల కోట్ల వాటాను కలిగి ఉన్నాయి. అలాగే, ఈ ఉత్పత్తులు 2020 గణాంకాల ప్రకారం మొత్తం ప్రపంచ దిగుమతుల్లో సుమారు రూ. 266 లక్షల కోట్ల వాటాను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎగుమతులకు సంబంధించి అమెరికా, జర్మనీ, కెనడా, జపాన్, చైనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అరబ్ ఎమిరేట్స్, మెక్సికో, బ్రిటన్ సహా పలు దేశాల పై ఎగుమతుల పరంగా దృష్టి ఉండనుంది. రాబోయే 75 నెలల్లో అంటే 2027 నాటికి భారత ఎగుమతుల లక్ష్యం 750 బిలియన్ డాలర్లు(రూ. 57 లక్షల కోట్లు)గా నిర్దేశించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed