12 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తా: గవర్నర్ తమిళిసై

by Dishanational1 |
12 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తా: గవర్నర్ తమిళిసై
X

దిశ, జడ్చర్ల: గిరిజనుల 12 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేపడుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఈ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శనివారం గిరిజన విద్యార్థి సంఘం గిరిజనుల 12 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఇచ్చిన పిలుపు మేరకు చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా రాజ్ భవన్ బయలుదేరిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను హైదరాబాద్ లోని రాంగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ భవన్ లో అందుబాటులో లేని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గిరిజన విద్యార్థుల రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమ విషయం తెలుసుకుని రాజ్ భవన్ కార్యాలయ సిబ్బందిని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు అరెస్ట్ చేసిన రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పాండిచ్చేరి రాష్ట్రం నుండి నేరుగా గిరిజన విద్యార్థి సంఘ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు.

ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడిత్య రమేశ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నాయక్, నాయకులు లోకేష్ నాయక్, బాలాజీ నాయక్, రాజ్ కుమార్, రవీందర్ నాయక్ లు గవర్నర్ తో వారు చేపట్టిన ఉద్యమ డిమాండ్స్, గిరిజనులకు ఆరు శాతం నుండి 12 శాతం రిజర్వేషన్ల కల్పన ఆవశ్యకతపై వివరించారు. వీరి సమస్యలు విన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ విద్యార్థి సంఘం నాయకులు తెలిపిన డిమాండ్ కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, తమ ముందు ఉంచిన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 23వ తేదీన నాగర్ కర్నూలు జిల్లాలో కలుద్దామని మరోసారి రాజ్ భవన్ లో వ్యక్తిగతంగా కలిసి రిజర్వేషన్ల పెంపు కార్యాచరణపై చర్చిద్దామని.. త్వరలోనే రాజ్ భవన్ లో గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తానని వారికి హామీ ఇచ్చారని గిరిజన విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడిత్య రమేష్ నాయక్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం కార్యాచరణపై చర్చిద్దామని స్వయంగా రాష్ట్ర గవర్నర్ హామీ ఇవ్వడం రిజర్వేషన్ల సాధనలో మొదటి విజయం ద్వారా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని, ఇకనైనా గిరిజన సమాజం ఉత్తుత్తి ఉద్యమాలు చేసే సంఘాల జెండా కాకుండా జాతి కోసం నిరంతరం నిస్వార్థంగా, నిజాయితీగా, త్యాగాలతో కూడిన గిరిజన విద్యార్థి సంఘం జెండా ఎత్తాలని.. మేరమ్మ ఆశీస్సులు పొంది సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను సాధించుకుందామని జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన గిరిజన విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడిత్య రమేశ్ నాయక్ పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed