నల్లమలకు చేరుకున్న గవర్నర్ తమిళిసై..

by Dishafeatures2 |
నల్లమలకు చేరుకున్న గవర్నర్ తమిళిసై..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఆదివాసి చెంచు గిరిజనుల జీవన, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు శనివారం ఉదయం 8:42 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గల మృగ వాణి గెస్ట్ హౌస్‌కి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీ రామ్ నాయక్ సహా ఇతర జిల్లా అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి అల్పాహారం తీసుకున్న అనంతరం గ్రామంలోని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అధికారులు మహిళలకు స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కుట్టు మిషన్ శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడి వారు తయారు చేసిన బ్యాగులను పరిశీలించారు.


అంతకుముందు అటవీశాఖ నల్లమల అటవీ ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల విషయంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌‌ను అటవీ శాఖ అధికారులతో కలిసి వీక్షించారు. అలాగే అపోలో వారి సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రం ద్వారా అద్భుతంగా వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

గవర్నర్‌ను సన్మానించిన జెడ్పి చైర్ పర్సన్..

నల్లమల పర్యటనకు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మన్న నూరు అటవీ శాఖ వనమూలిక వద్ద జెడ్పి చైర్ పర్సన్ పద్మావతి బంగారయ్య శాలువ పూల మొక్కతో సన్మానించారు. తదుపరి 10: 2 నిమిషాలకు మన్ననూర్ నుండి నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో గల అప్పాపూర్ చెంచు వెంటకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బయలుదేరి వెళ్లారు.

గవర్నర్‌కు వినతులు..

నల్లమల ప్రజలకు ఇచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు అటవీ ప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్న సమీప గ్రామాలు ప్రజల నిరుద్యోగులకు అటవీ శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అటవీ శాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పంపిణీ కంపా నిధులు జీవో నెంబర్ 2 ప్రకారం లక్ష రూపాయల కంటే అధిక నిధులు కేటాయించి పనులకు టెండర్ ద్వారా స్థానిక బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి షరతులు లేకుండా కేటాయించాలని అన్నారు.


దాంతో పాటుగా నల్లమల ప్రాంతంలో ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలను అటవీ శాఖ ఆంక్షలు లేకుండా భక్తులకు అందుబాటులోకి తేవాలని, అలాగే మాదాసి కురువ సామాజిక వర్గానికి చెందిన వారిని ఎస్సీ జాబితాలో కలపాలని సత్యాలు మరియు విజయ్ అప్ప తదితరులు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఐఎఫ్ఎస్, అమ్రాబాద్ డివిజనల్ అధికారి రోహిత్ గోపి డి ఎఫ్ ఎస్, జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శ్రీనివాసులు, ఇతర అటవీశాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed