సింగరేణి కార్మికులతో కలిసి కాంగ్రెస్ ఉద్యమం : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

by Disha Web Desk |
సింగరేణి కార్మికులతో కలిసి కాంగ్రెస్ ఉద్యమం : దుద్దిళ్ల శ్రీధర్ బాబు
X

దిశ, కాటారం : చమురు, వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో డెవలప్మెంట్ , విద్యుత్ చార్జీలను పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవన స్థితిగతులపై దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాల పనితీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆదివారం కాటారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన అసెంబ్లీ సమావేశాలు ముగియగానే విద్యుత్ ధరలు పెంచి ప్రజలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంటనూనెల ధరలు ఇప్పుడు కిలోకు రూ.200 దాటిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, చమురుపై వ్యాట్‌ను తగ్గించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సింగరేణి సమ్మెకు కాంగ్రెస్ పూర్తి మద్దతు

దేశవ్యాప్తంగా ఈ నెల 28 29 తేదీల్లో జరిగే సింగరేణి కార్మికులు సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు , సంఘీభావం ప్రకటిస్తున్నట్లు మాజీ మంత్రి మంథని శాసన సభ్యులు శ్రీధర్ బాబు తెలిపారు. సింగరేణి బొగ్గు బావులు ప్రైవేటీకరణ చేస్తే సింగరేణి కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటారని కేంద్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి ప్రైవేటీకరణ నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే ఎంతో మంది తెలంగాణలో ఉద్యోగాలు కోల్పోతారని, వేరే రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ ఉద్యోగం పొందుతారని ఈ ప్రాంతవాసుల కోసం సింగరేణి బొగ్గు గనుల నుండి వెలికి తీసే కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి ప్రైవేటీకరణ చేయవద్దని ఇక్కడ మాట్లాడుతూ తన ఆధీనంలో ఉన్న ఒరిస్సాలోని నైని సింగరేణి బొగ్గు గని ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమం లో కాటారం ఎంపీపీ పన్తకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

విలేకరుల సమావేశంలో కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ జాడి మహేశ్వరి, డీసీసీ ఉపాధ్యక్షుడు గద్దె స్వామిరెడ్డి , సర్పంచులు అంగజాల అశోక్, వేమునూరి రమేష్ రెడ్డి, అందే సత్యనారాయణ, జంగిలి నరేష్, బొడిగె రాజావీరు గౌడు, మేడి పెళ్లి కిరణ్, కడారి విక్రమ్, పాల్గొన్నారు.

Next Story

Most Viewed